MLC Kavita: ‘ప్రజా పాలన దరఖాస్తులో నిరుద్యోగ భృతిపై ప్రస్తావించలేదు’: ఎమ్మెల్సీ కవిత..

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. అయితే మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

MLC Kavita: 'ప్రజా పాలన దరఖాస్తులో నిరుద్యోగ భృతిపై ప్రస్తావించలేదు': ఎమ్మెల్సీ కవిత..
Mlc Kavita
Follow us
Srikar T

|

Updated on: Dec 27, 2023 | 6:37 PM

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకాలు చేశారు. అయితే మిగిలిన నాలుగు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజా పాలన పేరుతో లబ్ధదారుల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు కార్యచరణను రూపొందించారు. ఈకార్యక్రమం డిశంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు, మూడు అంశాల పట్ల గ్రామాల్లో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు. రాష్ట్రంలో 44 లక్షల మంది పెన్షన్ దారులు వున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి నెలకు ఇస్తామన్న రూ. 4000 నేరుగా ఇవ్వొచ్చు అని సూచించారు. ప్రతి నెలా పెన్షన్ తీసుకునే వారిని కొత్తగా అర్జీ పెట్టుకోండి అనడం సరైంది కాదన్నారు.

రైతుల అకౌంట్‎లో రైతు బంధు ఇప్పటి వరకూ జమ చెయ్యలేదని తెలిపారు. ఎప్పుడు తమ పెట్టుబడి సాయం అందుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. రైతులకు ఇస్తామన్న రైతు బంధు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు కాంగ్రెస్ తన ప్రజాపాలనకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రితో పాటూ పలు శాఖల మంత్రులు పాల్గొన్నారు. దీనిపై కూడా కవిత స్పందించారు. ఈరోజు రిలీజ్ చేసిన అప్లికేషన్‎లో నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోండి అని ఎక్కడ లేదు. అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన హామీ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. అలాగే జనవరి 1 నుండి గ్రామాల్లో 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రకారం కొత్త సంవత్సరం జనవరి 1 నుండి దీనిని అమలు చెయ్యాలని ప్రభుత్వానికి తెలిపారు. దీంతో పాటు కొత్త పెన్షన్ రూ. 4000 కూడా జనవరి నుంచే అమలు చేయాలని సూచించారు. రేషన్ కార్డులు వెంటనే ఎందుకు ఇవ్వడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు కవిత చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!