Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Celebrations: న్యూఇయర్ వేడుకలపై కరోనా ఎఫెక్ట్.. సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేస్తున్న సిటిజన్స్..?

కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో కరోనా కొత్త వెరిఏంట్ ఒక్కసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ న్యూఇయర్ వేడుకల పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎన్నో ప్లాన్స్ చేసుకున్న వారు ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుదలతో ఆలోచనలో పడ్డారు.

New Year Celebrations: న్యూఇయర్ వేడుకలపై కరోనా ఎఫెక్ట్.. సెలబ్రేషన్స్ ఇలా ప్లాన్ చేస్తున్న సిటిజన్స్..?
New Yerar Celebrations
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Srikar T

Updated on: Dec 27, 2023 | 7:06 PM

కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్దం అవుతున్న సమయంలో కరోనా కొత్త వెరిఏంట్ ఒక్కసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ న్యూఇయర్ వేడుకల పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎన్నో ప్లాన్స్ చేసుకున్న వారు ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుదలతో ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే సిద్దం చేసుకున్న ఈవెంట్‎లకు వెళ్లాల వద్దా అనే ప్రశ్న కొందరిలో మొదలైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4వేలకు పైగా కరోనా ఆక్టివ్ కేసులు ఉండగా ఇందులో వందకి పైగా కొత్త వేరియంట్ జేఎన్ .1 కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు తెలంగాణలో జేఎన్.1 కేసులపై క్లారిటీ రాకపోయినా ఆక్టివ్ కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 60కి పైగా ఆక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల పెరుగుదలపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయి.. తగిన సూచనలు చేస్తుంది. అయితే పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. దీంతో మరో ముడు రోజుల్లో రానున్న న్యూ ఇయర్ వేడుకల పై ప్రభావం కనిపించే అవకాశం ఉంది.

ఇప్పటికే హైదరబాద్‎తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెద్ద నగరాల్లో న్యూ ఇయర్ ఈవెంట్‎లు ప్లాన్ చేశారు నిర్వాహకులు. చాలా చోట్ల ఈవెంట్‎లకు సంబందించిన టికెట్‎లు సైతం అందరూ బుక్ చేసుకున్నారు. కానీ పెరుగుతున్న కరోనా కేసులతో ఈవెంట్‎లకి బయటకి వెళ్ళాలా? వద్దా? అన్న ఆలోచనలో పడ్డారు పబ్లిక్. పెద్ద, చిన్న ఈవెంట్లు సరదాగా ఉన్నప్పటికీ జన సందోహంలోకి వెళ్తే ఎలాంటి ముప్పు పొంచివుంతుందో అని చాలా మంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. ఇయర్‎కి ఒకసారి చేసుకొనే న్యూ ఈవెంట్‎కి వెళ్లకపోతే జోష్ మిస్ అవుతామని అనుకుంటున్నప్పటికీ.. ఎక్కువ పబ్లిక్‎లోకి వెళ్తే వచ్చే ప్రమాదంపై చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ చాలా మంది జన సమూహంలోకి వెళ్లకుండా.. కొత్త సంవత్సరం సరదాను మిస్ అవ్వకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‎తో చిన్న పాటి ఈవెంట్‎లాగా సెలబ్రేట్ చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికోసం చిన్న రిసార్ట్ లు,ఫామ్ హౌస్‎లు, పల్లె వాతావరణం తలపించే గ్రామ శివారు ప్రాంతాలతో పాటు సిటీలోని అపార్ట్‎మెంట్‎లని అలంకరిస్తూ సిద్దం చేసుకుంటున్నారు సిటిజన్స్. ఏది ఏమైనా ఈ సారి కరోనా ఎఫెక్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‎పై కొంత ప్రభావం చేపుతుందని కొందరు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..