Big News Big Debate: “వేటాడతాం – వెంటాడతాం… టార్గెట్ బీఆర్ఎస్”
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు రేవంత్‌రెడ్డి. అప్పుడే ఏమైందని.. ముందుంది ముసళ్ల పండగ అన్నారు సీఎం. పవర్ ప్లాంట్ అక్రమాల నుంచి కాళేశ్వరం వరకూ దర్యాప్తు జరుగుతుందని.. నిజాలు బయటపడిన తర్వాత రికవరీ యాక్ట్ కూడా ఉంటుందన్నారు సీఎం.
ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీల ధరఖాస్తుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలోని అవినీతి ఆరోపణలతో పాటు ఖాజానాపైనా సంచలన కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఖచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు రేవంత్‌రెడ్డి. అప్పుడే ఏమైందని.. ముందుంది ముసళ్ల పండగ అన్నారు సీఎం. పవర్ ప్లాంట్ అక్రమాల నుంచి కాళేశ్వరం వరకూ దర్యాప్తు జరుగుతుందని.. నిజాలు బయటపడిన తర్వాత రికవరీ యాక్ట్ కూడా ఉంటుందన్నారు సీఎం.
కేసీఆర్ కుటుంబం ప్రజలను పీల్చి పిప్పి చేసి లక్షల కోట్లు సంపాదించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో లక్ష రూపాయిలు మాత్రమే ప్రజలకు ఇప్పించామని.. ఇంకా వసూలు చేయాల్సింది చాలా ఉందన్నారు సీఎం. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతానని ముందే ఊహించి ఖరీదైన కార్లు కొని విజయవాడలో దాచిపెట్టారన్నారు. ఒక్కక్కటి 3 కోట్ల విలువైన ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొని సిద్ధంగా ఉంచుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం వృథా చేయడంలో కేసీఆర్ ముందున్నారన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రంలో ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్లిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లంకెబిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ బిందెలు మాత్రమే కనిపించాయంటూ వ్యాఖ్యానించారు సీఎం.
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్. బట్టకాల్చి మీద వేసేలా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మామూలు పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్‌కు వందలకోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు శ్రవణ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..