Telangana: టెన్త్ పరీక్షల రీ షెడ్యూల్‌.. రేపే కీలక ప్రకటన !

పదో తరగతి పరీక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

Telangana: టెన్త్ పరీక్షల రీ షెడ్యూల్‌.. రేపే కీలక ప్రకటన !
Telangana Inter Exams
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 27, 2023 | 5:34 PM

పదో తరగతి పరీక్షల నిర్వాహణపై విద్యా శాఖ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి మార్చి రెండు లేదా మూడో వారంలో టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించే యోచలో ఉంది విద్యాశాఖ. ఈ మేరకు పరీక్షలపై స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, SSC బోర్డు డైరెక్టర్ కృష్ణారావు.. ఇతర విద్యా శాఖ అధికారులతో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం సమావేశం నిర్వహించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగిన ఈ సమయాశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం  అక్కడి నుంచి సెక్రటేరియట్‌కు చేరుకున్నారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణ.. సమగ్ర శిక్ష అభియాన్‌పై విద్యా శాఖ అధికారులతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం పదో తరగతి పరీక్షల రీ షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎంతో సమావేశం అనంతరం పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ ఇస్తామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.

టెన్త్, ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా.. పకడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్ ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.  గతంలో జరిగిన లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావించి.. అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూడాలన్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..