Telangana: డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన ఆ రాజకీయ పార్టీ.. న్యూ ఇయర్ తరువాత భవిష్యత్ కార్యాచరణ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పరిమితమైన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోంది. వచ్చే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కనీసం రెండంకెల స్థానాలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ తరువాత రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కి పరిమితమైన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తోంది. వచ్చే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కనీసం రెండంకెల స్థానాలపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ తరువాత రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 17 స్థానాల్లో సభ్యులను బరిలో దింపేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఈసారి తెలంగాణ నుండి రెండంకెల స్థానాలను కైవసం చేసుకునేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కిషన్‌రెడ్డి, సంజయ్, అరవింద్‌లను వారి సిట్టింగ్ స్థానాల నుంచి మళ్ళీ కొనసాగేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బండి సంజయ్, అరవింద్, బాబురావు ముగ్గురూ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం బండి సంజయ్, అరవింద్‌లు పోటీ చేసే లోక్ సభ స్థానాల్లో ఇతర పోటీదారుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేనప్పటికీ, బీఆర్ఎస్ నాయకుడు రాథోడ్ బాబు, తెలుగుదేశం నాయకుడు రమేష్ రాథోడ్ వీరిద్దరూ ఆదిలాబాద్ ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇక ఈటల రాజేందర్, కే రఘునందన్‌రావు, పీ మురళీధర్‌రావు, డీకే అరుణ, పీ జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నరసయ్యగౌడ్ తదితర నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వీటన్నింటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడం కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ 28 న పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశానికి హాజరవుతారు. “మేము తెలంగాణ నుండి రెండంకెల స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రజలు లోక్‌సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకోండి’’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..