AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదే… బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే: చిట్‌చాట్‌లో కవిత

ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్‌ వద్దని బీఆర్ఎస్‌ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని...

Telangana: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదే... బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే: చిట్‌చాట్‌లో కవిత
Mlc Kavitha
K Sammaiah
|

Updated on: Jul 17, 2025 | 11:27 AM

Share

ఎమ్మెల్సీ కవిత చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్‌ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్‌ వద్దని బీఆర్ఎస్‌ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్‌కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని అన్నారు. తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న అంశమిది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో.. ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రిజర్వేషన్ల ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత.. మంత్రి, సీఎం ఆమోదంతో రాజ్‌భవన్‌కు ముసాయిదాను పంపించింది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ ప్రకారం స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండాలి. అందులో 50శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించి.. చట్టాన్ని సవరిస్తే రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి చిక్కులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.

ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే.. గవర్నర్ ఆమోదిస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.

Follow Us
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..