తెలంగాణ వచ్చాక పేదలకు అనేక సంక్షేమ పథకాలు.. జుక్కల్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
MLC Kavitha comments : ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలను స్వంత రాష్ట్రంతో సాధ్యమయ్యాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి,కుల్లె కడిగి,చిట్టెపు కులాల రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో అంతరించిపోయిన కులాలను ప్రోత్సహిస్తూ.. అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
తెలంగాణ చిన్న రాష్ట్రం ఆయినా అనేక అంశాలలో నెంబర్‌గా నిలిచిందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కేవలం కొద్ద సంవత్సరాలల్లోనే కట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిదేనన్న కవిత… వరి పంట విషయంలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంతో పోటీ పడుతోందన్నారు. పిట్లం మండలానికి సాగు నీరు అందించడానికి నాగ మడుగు పథకం తీసుకువచ్చామన్న కవిత.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక, పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలో, బీసీ కమిషన్ అధ్యయనం తరువాత చిట్టెపు కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో చేర్చిందని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.