AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.. రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగ్గారెడ్డి..

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వెంటనే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. కుంతియాను కూడా కోరానని తెలిపారు. జీవో.111ను పీసీసీ పదవికి లింక్ పెడుతున్న ప్రచారంపై సమావేశంలో చర్చించాలన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణలపై గురువారం చట్టసభల్లో కూడా చర్చకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా గంధంగూడ […]

పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.. రేవంత్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ జగ్గారెడ్డి..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2020 | 7:17 PM

Share

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ అనుచరులు కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వెంటనే కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు.. కుంతియాను కూడా కోరానని తెలిపారు. జీవో.111ను పీసీసీ పదవికి లింక్ పెడుతున్న ప్రచారంపై సమావేశంలో చర్చించాలన్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణలపై గురువారం చట్టసభల్లో కూడా చర్చకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా గంధంగూడ భూ కబ్జా అంశాన్ని ఎమ్మెల్సీ ఎమ్మెఎస్ ప్రభాకర్ రావు లేవనెత్తారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ రెడ్డి దళితుల భూమిని కబ్జా చేశారని, అది వారికే అప్పగించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కోరారు. దాంతో పాటు దళితుల భూములు ఆక్రమించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభావకర్ రావు ప్రశ్నలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. దళిత భూములను కబ్జా చేసిన రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
‘జాబ్ హగ్గింగ్’ వల్ల మీ కెరీర్ ప్రమాదంలో పడవచ్చు!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
అభిషేక్‌తో పార్టనర్‌షిప్ గుట్టు విప్పిన సంజూ!
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. వారికి ఈ పులుసు బెస్ట్..
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
ఇవాళ వెలువడనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
టూర్ లేదా ఫంక్షన్లకు వెళ్లేందుకు ట్రైన్ కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
ఫిట్‌నెస్ కోచ్ చెబుతున్న ‘కార్బ్’ సీక్రెట్స్‌
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!