AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరబ్ దేశాలు మెచ్చిన మన మ్యాంగో.. మంత్రి తుమ్మల సొంతంగా పండించిన మామిడి కి యమ గిరాకీ

హైదరాబాద్ కు చెందిన ఓ ఇంటర్నేషనల్ ఫ్రూట్ ఎక్సపోర్టు కంపెనీ ప్రతినిది గని మామిడి కాయ దిగుబడి,నాణ్యత పరిశీలించి సేంద్రియ పోషకాలు ఇస్తూ, పేపర్ కవరింగ్ లో సాగుచేసిన ఇలాంటి కాయలకు కెనడా,కువైట్, ఇరాక్, ఖతార్, సౌదీ దేశాలలో మంచి డిమాండ్ ఉందని, సరైన పద్ధతుల్లో కాయలు పండిస్తే ఎయిర్ కార్గో ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ కు పంపడానికి

అరబ్ దేశాలు మెచ్చిన మన మ్యాంగో.. మంత్రి తుమ్మల సొంతంగా పండించిన మామిడి కి యమ గిరాకీ
Telangana Mangoes
N Narayana Rao
| Edited By: |

Updated on: May 02, 2025 | 2:09 PM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల గ్రామం నుండి మామిడికాయలు గల్ఫ్ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి ,ఈ మామిడి తోట ఎవరిదో అనుకొంటున్నారా? మరి ఎవరిదో కాదు సాక్షాత్తు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. నాగేశ్వరరావుది , ఈ మామిడి కాయల కోసం అరబ్ దేశాల వారు ఆసక్తి చూపుతున్నారంటే వీటి ప్రత్యేకత ఏంటో చూడండి, నూతన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తే అధిక దిగుబడులే కాక నాణ్యమైన కాయలు కాసి అవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి ధరకు అమ్ముడవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లి లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన మామిడి వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాల్లో బంగినపల్లి, సువర్నరేఖ, హిమాం పసంద్,అల్ఫోన్సో, కేసర్, కొత్తపల్లి కొబ్బరి తోతాపురి,వైట్ గులాబ్ , హిమాయుద్దీన్, మాల్వా వంటి 15 రకాల మామిడి మొక్కలు వేసి హైడెన్సిటీ (అధిక సాంద్రత)యాజమాన్య పద్ధతి ద్వారా తోటను పెంచి నాణ్యమైన మామిడి పండించారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి ధర వచ్చే స్థాయిలో దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే దిగుబడిలో వ్యత్యాసాలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబించి సాగు చేసినట్లయితే అత్యధిక లాభాలు గడించి రైతుకు మేలు చేకూరుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త విజయ కృష్ణ అంటున్నారు.

సాంప్రదాయ పద్ధతుల్లో మామిడి మొక్కలు వేయాలంటే మొక్కకి మొక్కకి 8× 8 మీటర్ల దూరంలో మొక్కలు వేయాలని ఇలా ఎకరాకు 63 మొక్కలు మాత్రమే వేయాల్సి ఉంటుందని,కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హైడెన్సిటీ ప్లాంటేషన్ పద్ధతి ద్వారా వేసినట్లయితే 55 మీటర్ల దూరంతో ఎకరాకు 160 మొక్కలు వరకూ వేసుకునే వెసులుబాటు ఉంటుందని,కాయలకు పిందె దశ లొనే పేపర్ కవరింగ్ ద్వారా చేసినట్లయితే నాణ్యమైన కాయలు కాస్తాయని , వీటి ధర సాధారణ సాగులో పండించిన పంటకంటే రెట్టింపు దిగుబడే రావటమే కాకుండా ధర కూడా రెండింతలు మార్కెట్ ధర ఉంటుందని, ఒక్కో టన్నుకు అదనంగా 30 వేల రూపాయలు ఆదాయం వస్తుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ కు చెందిన ఓ ఇంటర్నేషనల్ ఫ్రూట్ ఎక్సపోర్టు కంపెనీ ప్రతినిది గని మామిడి కాయ దిగుబడి,నాణ్యత పరిశీలించి సేంద్రియ పోషకాలు ఇస్తూ, పేపర్ కవరింగ్ లో సాగుచేసిన ఇలాంటి కాయలకు కెనడా,కువైట్, ఇరాక్, ఖతార్, సౌదీ దేశాలలో మంచి డిమాండ్ ఉందని, సరైన పద్ధతుల్లో కాయలు పండిస్తే ఎయిర్ కార్గో ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్ కు పంపడానికి ఎన్నో ఫ్రూట్ ఎక్సపోర్టు కంపెనీలు హైదరాబాద్ లోనే సిద్ధంగా ఉన్నాయని ఎక్స్పోర్ట్ ప్రతినిధి గని అంటున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు కూడా టన్నుకు డెబ్భై వేలు వరకు ఉంటుందని,వ్యవసాయ శాఖ,ఉద్యానవన శాఖ వీటిపై దృష్టి పెట్టి రైతులకు నూతన సాగు పద్ధతులు తెలియజేస్తే రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేసి అధిక లాభాలు గడిస్తారని రూట్ గని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..