బాబోయ్.. బతికి ఉంటేనే కాదు.. ఈ పాము చనిపోయిన తరువాత కూడా విషం చిమ్మగలదు..!
దేశవ్యాప్తంగా పాము కాటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల పాముల గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే..బతికి ఉన్న పాముతో పాటు, చనిపోయిన పాము కూడా ప్రమాదకరమని పలు నివేదికలు చెబుతున్నాయి. అది ఎలా సాధ్యం అని షాక్ అవుతున్నారు కదా.. ఈ నివేధిక పూర్తి వివరాల్లోకి వెళితే..

వర్షాకాలంలో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. కానీ, గత కొద్ది రోజులుగా సీజన్‌తో పనిలేకుండా పాము కాటు కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా పాము కాటు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని రకాల పాముల గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే..బతికి ఉన్న పాముతో పాటు, చనిపోయిన పాము కూడా ప్రమాదకరమని పలు నివేదికలు చెబుతున్నాయి. అది ఎలా సాధ్యం అని షాక్ అవుతున్నారు కదా.. ఈ నివేధిక పూర్తి వివరాల్లోకి వెళితే..
నివేదికల ప్రకారం, పాము విషం దాని విష గ్రంధులలోనే ఉంటుంది. ఆ విష గ్రంథి వాటి తల దగ్గర ఉంటుంది.. చనిపోయిన పాము కోరపై ఎవరైనా పొరపాటున కాలు వేస్తే, అందులో విషం ఉంటే, అది వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాము విషం మరణం తర్వాత కూడా ఉంటుందని, చర్మంతో సంబంధంలోకి వచ్చిన తర్వాత కూడా శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతారు. ఇది మానవులకు ప్రమాదకరం.
నివేదికల ప్రకారం, ఒక పాము కరిచినప్పుడు అక్కడ దాని రెండు దంతాల గుర్తులు కనిపిస్తే..ఆ పాము చాలా విషపూరితమైనదని చెబుతారు. ఇంకా, రెండు కంటే ఎక్కువ గుర్తులు ఉంటే, అది సాధారణ, విషం లేని పాము ఉండవచ్చని చెబుతున్నారు. మీకు ఏవైనా సమస్యలు ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




