AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దెయ్యాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు వస్తాయో తెలుసా..? భయపడేవారు ఈ వార్త చదవకండి..

ప్రజలు దెయ్యాల కథలు చదవడానికి, సినిమాలు చూడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే, దెయ్యాలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే, ఇక్కడ ఒక సందేహం ఏంటంటే.. దెయ్యాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? అది మీకు తెలుసా..?

దెయ్యాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు వస్తాయో తెలుసా..? భయపడేవారు ఈ వార్త చదవకండి..
Ghosts
Jyothi Gadda
|

Updated on: May 02, 2025 | 11:44 AM

Share

ప్రపంచవ్యాప్తంగా దెయ్యాల గురించి భిన్నమైన నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. అనేక సంస్కృతులు ఆత్మలు, మరణానంతర జీవితం, మరోప్రపంచపు జీవుల ఉనికిని నమ్ముతాయి. కాబట్టి ప్రజలు దెయ్యాల కథలు చదవడానికి, సినిమాలు చూడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే, దెయ్యాలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే, ఇక్కడ ఒక సందేహం ఏంటంటే.. దెయ్యాలు రాత్రిపూట మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? అది మీకు తెలుసా..?

దేవుడు ఉన్నట్లే దయ్యాలు కూడా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులలో దెయ్యాలను చనిపోయినవారి ఆత్మలుగా లేదా నెరవేరని కోరికలతో వెంటాడే, సంచరించే ఆత్మలుగా పరిగణిస్తారు. దెయ్యాలు అంటే అకాల మరణం చెందిన వారి ఆత్మలుగా నమ్ముతారు. అయితే, దయ్యాల ఉనికికి గట్టి ఆధారాలు లేవు. వాటిని చూశామని చెప్పుకునే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే, రాత్రిపూట మాత్రమే దెయ్యాలు ఎందుకు కనిపిస్తాయనే దానిపై నిపుణులు ఒక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. వారి ప్రకారం, రాత్రి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ విద్యుదయస్కాంత ప్రభావం ఉంటుంది..

అదే పగటిపూట ఎలక్ట్రానిక్ పరికరాలు, లైట్లు, ఇతర కార్యకలాపాల వల్ల కలిగే శక్తి అంతరాయం దెయ్యాల శక్తిని తగ్గిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ ఆత్మలు రాత్రి నిశ్శబ్ద వాతావరణంలో తమ ఉనికిని సులభంగా చాటుకోగలవు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..