ఇది పోషకాల పండు.. లాభాలు మెండు.. మధుమేహానికి ఏకైక నివారణ..!
డ్రాగన్ ఫ్రూట్.. ఇది విభిన్నమైన పండు. మనకు మార్కెట్లో లభించే అన్ని రకాల పండ్లలు వేటికవే ప్రత్యేక లక్షణాలతో పాటు ప్రయోజనాలను కలిగి వున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా నిండి ఉంటాయి. రోజుకో పండు తినటం వల్ల రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తరచూ తినడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో తెలుసుకుందాము.
Updated on: May 02, 2025 | 7:05 AM

Dragon Fruit

డ్రాగన్ ఫ్రూట్‌లోని భాస్వరం, మెగ్నీషియం దృఢమైన ఎముకలు, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ ఎక్కువగా వుంటుంది. కనుక ఇది బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఉచిత ఆర్గానిక్ ఫైబర్ లభిస్తుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. డ్రాగన్ ఫ్రూట్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో వయస్సు మీద పడే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. అలాగే డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పర్యావరణ కాలుష్యం వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి.

Dragon Fruit




