- Telugu News Photo Gallery Do practice these habits every morning to stop hair fall get faster your hair growth
మార్నింగ్ మీ అలవాట్లలో ఈ చిన్న టిప్స్పాటిస్తే చాలు.. జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది!
ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలిపోవడం, బట్టతల, పొడి జుట్టు, చిన్న వయసులోనే తెల్ల జుట్టు వంటివి చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇంటర్ లింక్ ప్రాబ్లమ్స్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కొన్ని ఇంటి చిట్కాలు, అలవాట్లను ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. మీరు పాటించే అలవాట్లే మీ ఆరోగ్యంతో పాటు కేశ సౌందర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
Updated on: May 02, 2025 | 8:49 AM

మంచి అలవాటుతో మీ రోజును ప్రారంభించడం వల్ల మీకు విశ్రాంతి లభించడమే కాకుండా, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడం తగ్గించుకుని, సహజంగా ఆరోగ్యకరమైన, బలమైన, మందపాటి జుట్టును పొందాలనుకుంటే మార్నింగ్ మీ అలవాట్లు ఎక్కువ ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్రలేచిన వెంటనే మీ జుట్టును రెండు నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. ఇది జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. స్కాల్ప్ మసాజ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుంది.

ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే నీరు తాగడంతో శరీరం రీ హైడ్రేట్ అవుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడమే కాకుండా తల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఎ, బి అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి.

ఉదయాన్నే మీరు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ కూడా అతి ముఖ్యమైనది. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తినండి. వాటిలో గుడ్లు, పప్పులు, గింజలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి మీ జుట్టును బలోపేతం చేస్తాయి.

దుమ్ము, కాలుష్యం నుండి మీ జుట్టును రక్షించుకోవడానికి బయటకు వెళ్ళే ముందు మీ జుట్టుకు హెయిర్ సీరం తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ జుట్టుకు కాలుష్యం నుండి రక్షణనిస్తుంది. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే కాటన్ క్యాప్ వాడడం మంచిది. ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. దీని కోసం, ఉదయం కనీసం 10 నిమిషాలు యోగా చేయండి.




