- Telugu News Photo Gallery Cinema photos Actress Nabha Natesh Latest Lehanga Photos Goes Viral In Social Media
Nabha Natesh: లెహాంగాలో అందాల పుత్తడిబొమ్మ.. స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేస్తోన్న నభా నటేష్..
ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ హీరోయిన్గా మారిపోతుంది నభా నటేష్. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ట్రెడిషనల్ లుక్స్ లో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Updated on: May 02, 2025 | 8:58 AM

తెలుగులో అందం, అభినయంతో కట్టిపడేసిన హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యింది. యాక్సిడెంట్ కారణంగా ఇండస్ట్రీలో సైలెంట్ అయినట్లు చెప్పుకొచ్చింది.

ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు వరుస సినిమాలతో అలరిస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో నభా నటేష్ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ కట్టిపడేస్తుంది. లంగావోణిలో అచ్చం యువరాణిలా ముస్తాబై మరింత అందంగా కనిపిస్తుంది.

రాధ తరహాలో రెడీ అయ్యి కోటలో ఫోటోషూట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే నభా నటేష్ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది నభా నటేష్. ఇందులో వారియర్ ప్రిన్సెస్ పాత్రలో నటిస్తుంది. అలాగే పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న నాగబంధంలోనూ నటిస్తుంది.




