AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Sabitha’s Gunman Suicide: మంత్రి సబితా ఎస్కార్ట్ ఇంఛార్జ్ ఆత్మహత్యకు అసలు కారణం అదేనా..? ఒక్కొక్కటిగా తెరపైకి

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎఆర్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. లోన్ వేధింపుల వల్ల తను బలయ్యాడ..?? లేక ఇతర ఇబ్బందులు ఉన్నాయా..ఇలా ఫజల్ సూసైడ్ పై ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కన్న కూతురి ముందే వెపన్ తో ఫైర్ చేసుకొని సూసైడ్ కి పాల్పడ్డం అందరిని కలిచివేస్తోంది. అసలు ఫజల్ ఈరోజు డ్యూటీకి పెద్ద కూతురు ఫాతిమాను ఎందుకు తీసుకువచ్చాడు..?? అంటే ఫజల్ సూసైడ్ చేసుకుందామని ముందుగానే ఫిక్స్ అయ్యాడా..?? ఎఆర్ ఎస్ ఐ ఫజల్ ఆత్మహత్య పై..

Minister Sabitha's Gunman Suicide: మంత్రి సబితా ఎస్కార్ట్ ఇంఛార్జ్ ఆత్మహత్యకు అసలు కారణం అదేనా..? ఒక్కొక్కటిగా తెరపైకి
Minister Sabitha Gunman ARSI Fazal
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Nov 05, 2023 | 11:51 AM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 5: ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఎఆర్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. లోన్ వేధింపుల వల్ల తను బలయ్యాడ..?? లేక ఇతర ఇబ్బందులు ఉన్నాయా..ఇలా ఫజల్ సూసైడ్ పై ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కన్న కూతురి ముందే వెపన్ తో ఫైర్ చేసుకొని సూసైడ్ కి పాల్పడ్డం అందరిని కలిచివేస్తోంది. అసలు ఫజల్ ఈరోజు డ్యూటీకి పెద్ద కూతురు ఫాతిమాను ఎందుకు తీసుకువచ్చాడు..?? అంటే ఫజల్ సూసైడ్ చేసుకుందామని ముందుగానే ఫిక్స్ అయ్యాడా..?? ఎఆర్ ఎస్ఐ ఫజల్ ఆత్మహత్య పై తెరపైకి వస్తున్నాయి.

ఎఆర్ ఎస్ఐ ఫజల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద ఎస్కార్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు..ఆగస్టు 8 2022 నుండి మంత్రి దెగ్గర డ్యూటీ చేస్తున్నాడు..రోజులానే ఈరోజు కూడా ఉదయం 6 గంటలకు రిలీవర్ కు రిలీవింగ్ ఇచ్చి.. తన కూతురితో కలిసి మంత్రి నివాసం పక్కనే ఉన్న మణికంఠ హోటల్ వద్దకు వచ్చాడు..అక్కడ కొంతసేపు మాట్లాడిన తర్వాత లోన్ విషయంలో బ్యాంక్ వారి వేధింపులు ఎక్కువయ్యాయని కూతురికి చెప్పి తన వద్ద ఉన్న లోన్ సంబంధించిన పత్రాలను కూతురి చేతిలో పెట్టి పక్కనే తన వెపన్ తో ఓక్కసారిగా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈరోజు ఉదయం 6 గంటలకు ఎఆర్ ఎస్ఐ ఫజల్ సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఘటన స్ధలాని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు..మంత్రి సబితాఇంద్రారెడ్డి వద్ద ఎస్కార్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఫజల్ ఆర్ధిక సమస్యల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తేల్చారు..కూతురిని తీసువచ్చి మాట్లాడిన తర్వాత సూసైడ్ కు పాల్పడ్డాడని డీసీపీ జోయల్ డేవీస్ తెలిపారు. కుటుంబసబ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎఆర్ ఎస్ ఐ ఫజల్ సూసైడ్ తో పలు ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. లోన్ వేధింపులా లేక ఇతర ఆర్ధిక లావాదేవీల సమస్యా…ఇంకేమైన ప్రాబ్లమ్ ఉందా… ఇలా చాలా ప్రశ్నలు తెరపైకి వస్తున్న క్రమంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇనీషియల్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని తేల్చినా బలమైన కారణమేంటనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లోనే తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.