AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ తమ వ్యూహాలను రచిస్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని విపక్ష పార్టీలు పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది.

Minister KTR: ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన కేటీఆర్
Minister KTR
Aravind B
|

Updated on: Aug 01, 2023 | 7:49 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 1:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ తమ వ్యూహాలను రచిస్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని విపక్ష పార్టీలు పాట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇటీవల వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, అలాగే హైదరాబాద్ పరిధిలో మెట్రో రైళ్లను విస్తరించడం లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు కీలక విషయాలను తెలియజేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు. ఇవి దేశంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదర్యంతో తీసుకున్న నిర్ణయాలని అన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లోకి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఇటీవల 21 వేల మందిని వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం.. అలాగే తాజాగా 43 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మానవీయతను చాటుకుందని వ్యాఖ్యానించారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి సంబరాలు చేయాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే అటు వీఆర్ఏల కుటుంబాలు.. ఇటు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో వీలినం చేస్తామని హామీ ఇచ్చామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అందుకోసమే సీఎం కేసీఆర్ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయం  తీసుకున్నారని.. ఇది కాంగ్రెస్ విజమయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే