AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Jupally: తులం బంగారం, మహిళలకు రూ.2500 పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు రూ.2500 పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేయకుంటే.. వాటికి వడ్డీలు కట్టేది లేకుంటే.. ఈ పథకాలను ఈజీగా అములు చేసేవే అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంపై అప్పుల భారం పెరిగిన కారణంగా వీటిని అమలు చేయడం కాస్తా ఇబ్బందిగా మారిందన్నారు. త్వరలోనే వీటిని అమలు చేస్తామన్నారు.

Minister Jupally: తులం బంగారం, మహిళలకు రూ.2500 పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
Minister Jupally
Anand T
|

Updated on: Nov 22, 2025 | 5:28 PM

Share

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు రూ.2500 పథకంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివరాం పెద్దకొత్తపల్లిలో ఇందిరా మహిళ శక్తి చీరలు, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మహిళలకు చెక్కలు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..తులం బంగారం, రూ.2500 పెన్షన్లు ఏమయ్యాయని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు ఇచ్చే లక్ష రూపాయలకే ప్రభుత్వానికి రూ. 4వేల కోట్ల ఖర్చు అవుతోంది.. దానికి పాటు తులం బంగారం కూడా మరో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వంపై మొత్తంగా మరో 4వేల కోట్ల ఖర్చు అవుతుంది. అలాగే మహిళలకు రూ.2500 పథకం అమలు చేయాలంటే రూ.10000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ రెండు పథకాలకు సుమారుగా 15వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ప్రభుత్వం అప్పు తెచ్చి వడ్డీ కడుతోందని.. ప్రభుత్వం ప్రతి ఏడాదికి గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలకే రూ.75 వేల కోట్లు కడుతుందన్నారు. అప్పుడు ఇంతలా అప్పులు చేయకుంటే.. వాటికి ఇప్పుడు వడ్డీలు కట్టేది లేకుంటే ఈ పథకాలు అమలు చేసేటివేగా అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మేము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌