AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అలా ఎలారా.. వాష్‌రూమ్‌కి వెళ్తా అని చెప్పి బాత్రూంలోకి వెళ్లిన రిమాండ్ ఖైదీ.. ఆ తర్వాత ట్విస్ట్

కల్వకుర్తిలో పోలీసులను కళ్లుగప్పి ఓ అంతరాష్ట్ర దొంగ పరారయ్యాడు. వారం రోజులైనప్పటికీ ఆచూకీ లేకపోవడంతో సంబంధిత సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన మల్లెపూల నాగిరెడ్డి ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగ.

Telangana: అలా ఎలారా.. వాష్‌రూమ్‌కి వెళ్తా అని చెప్పి బాత్రూంలోకి వెళ్లిన రిమాండ్ ఖైదీ.. ఆ తర్వాత ట్విస్ట్
Nagireddy
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Nov 22, 2025 | 1:24 PM

Share

పోలీసుల కళ్లుగప్పి ఓ అంతరాష్ట్ర దొంగ, రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. వారం రోజులైనరా ఆచూకీ లభించకపోవడంతో సంబంధిత ఖాకీలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి అంతరాష్ట్ర దొంగ. ఏపీ, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే వివిధ చోరి కేసుల విచారణ నిమిత్తం అంతరాష్ట్ర దొంగ, రిమాండ్ ఖైదీ మల్లెపూల నాగిరెడ్డిని ఈ నెల 11న నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో 13వ తేదీన రాత్రి పీఎస్ నుంచి దొంగ నాగిరెడ్డి ఎస్కేప్ అయ్యాడు. వాష్ రూమ్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన నాగిరెడ్డి ఎంతకు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా వెంటిలేటర్ అద్దాలను ను ధ్వంసం చేసి అందులోనుంచి పరారయ్యాడు. దీంతో అదే రోజు రాత్రి కల్వకుర్తి పట్టణంలోని బస్ స్టాండ్, ఇతర ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. విషయం ఉన్నతాధికారులకు చెప్పడంతో మరునాడు నుంచి అంతరాష్ట్ర దొంగ నాగిరెడ్డి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. కల్వకుర్తి వన్ టౌన్ ఎస్సై మాధవ రెడ్డికి చార్జ్ మెమో ఇవ్వడంతో పాటు… హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ నాయక్, కానిస్టేబుల్ లాల్ సింగ్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. మరో హోంగార్డు లక్ష్మణ్‌ను వనపర్తి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌