AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

ఓ వైపు చలి .. మరో వైపు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు.. అంతేకాకుండా బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది.

Weather Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్
Telangana Weather Alert
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2025 | 1:28 PM

Share

ఓ వైపు చలి .. మరో వైపు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. తెలంగాణలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు.. అంతేకాకుండా బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈనెల 24 వ తారీఖు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి 48 గంటలలో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

‘‘నిన్న మలక్కా స్ట్రైట్ యొక్క మధ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఈరోజు మలక్కా స్ట్రైట్ దాని సమీపంలోని దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో ఈరోజు ఉదయం 08:30 గంటలకు ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి ఈనెల 24వ తారీఖు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం గా మారే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. అంతేకాకుంగా.. రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానంగా తూర్పు దిశ నుంచి వీస్తున్నవి.’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):

శనివారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముంది.

రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us