AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యుత్ సిబ్బందిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోండి… డీజీపీని ఆదేశించిన మంత్రి

Minister Jagadish Reddy: విద్యుత్ సిబ్బందిపై పోలీసులు లాఠీలతో దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు మంత్రి జగదీష్ రెడ్డి. డీజీపీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.  విద్యుత్ శాఖా అత్యవసర సర్వీసు కిందకు వస్తుంది..

విద్యుత్ సిబ్బందిని చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకోండి... డీజీపీని ఆదేశించిన మంత్రి
Minister Jagadish Reddy
Sanjay Kasula
|

Updated on: May 22, 2021 | 3:36 PM

Share

విద్యుత్ సిబ్బందిపై పోలీసులు లాఠీలతో దాడి చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు మంత్రి జగదీష్ రెడ్డి. డీజీపీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు.  విద్యుత్ శాఖా అత్యవసర సర్వీసు కిందకు వస్తుంది అని తెలిపారు. అత్యవసర సర్వీసులకు ఆటంకం కల్పించొద్దని అన్నారు.  రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న విద్యుత్ సిబ్బందిపై దాడులు చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.  పోలీసులు చట్టబద్ధంగా వ్యహరించడంతోపాటు…  లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బంది ఐ డి కార్డులు చూడకుండా లాఠీలకు పని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. నల్లగొండలో జరిగిన సంఘటనలపై జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఎస్పీని కూడా ఆదేశించారు మంత్రి.

నల్గొండలో పోలీసులు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డెక్కినవారిపై కూడా లాఠీలకు పనిచేబుతున్నారు. సమాధానం చెప్పేలోపే భాదితులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. విద్యుత్ అధికారులు, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లను కూడా ఖాకీలు వదలేదు. పోలీసుల వైఖరితో విద్యుత్ మరమ్మతులు చేసేందుకు సిబ్బంది ముందుకు రాలేదు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి : బ్లాక్‌ మార్కెట్‌లో 10 వేలకు ఆనందయ్య మందు.. కొనసాగుతున్న ఐసీఎంఆర్‌, ఆయుష్ అధ్యయనం

TS Lockdown : అత్యంత కఠినంగా లాక్ డౌన్.. డెలివరీ బాయ్స్‌కు సైతం నో, బయటకొచ్చిన జనం మాటలు విని విస్తుపోతోన్న పోలీసులు