Palamuru Rangareddy lift irrigation: పాలమూరు ఎత్తిపోతల పథకంతో దశాబ్దాల కల నెరవేరింది: మంత్రి హరీష్ రావు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించినటవంటి మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు మీటనొక్కి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. శ్రీశైలం వెనుక ఉన్నటువంటి నీటి ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 60 రోజుల్లోనే ఏకంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలను, ఆరు జలాశయాలను నిర్మించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నిర్మించినటవంటి మొదటి దశ ఎత్తిపోతల్లోని పంపు మీటనొక్కి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. శ్రీశైలం వెనుక ఉన్నటువంటి నీటి ఆధారంగా కృష్ణా నది నుంచి కోతిగుండు ద్వారా నీటిని తీసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 60 రోజుల్లోనే ఏకంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా అయిదు ఎత్తిపోతలను, ఆరు జలాశయాలను నిర్మించారు. ఇందులో భాగంగానే మొదటి పంపుహౌసులో తొలి పంపును సిద్ధం చేశారు. భూగర్భంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఉపరితలంపై ఏర్పాటు చేసినటువంటి కంట్రోలింగ్ కేంద్రం నుంచి పంపు మీట నొక్కి నీటి ఎత్తిపోతను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవాంతరాలు, అడ్డంగులను అధిగనిస్తూ.. కుట్రలను ఛేదిస్తూ.. కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చి పాలమూరు ప్రజల పాదాలు కడుగుతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కృతజ్ఞతలని తెలిపారు. పాలమూరు ప్రజల దశాబ్దాల కల, తరతరాల ఎదురుచూపులు నెరవేరే సమయం ఆసన్నమైనట్లు పేర్కొన్నారు. నెర్రెలు బారినటువంటి పాలమూరు నేలను తడపడానికి కృష్ణమ్మ రానుందని అన్నారు. నాడు పాలకులు మారినా కూడా పాలమూరు ప్రజల బతుకులు మారలేవని అన్నారు. తాగు, సాగునీటికి తిప్పలు తప్పలేవన్నారు. కానీ పదేళ్ల స్వరాష్ట్రంలో.. సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు దశ దిశ మారిందని పేర్కొన్నారు. నదులు, చెరువులు, వాగులు ఎండిన చేలా దాహాన్ని తీరుస్తున్నాయని.. పచ్చదనాన్ని పరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు.
ఇది తెలంగాణ సాధించనటువంటి శతాబ్ధపు విజయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా ఈ పథకం ప్రారంభోత్సవంపై స్పందించారు. తరతరాల ఎదురు చూపులు ఫలించిన వేళ.. పల్లేర్లు మొలచిన పాలమూరులో పాలనురగల జలహేల అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రచారంలో ఉండేది. అయితే ఈసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహగాణాలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉండొచ్చని చెప్పడి ఈ ఊహగాణాలను మరింత పెంచేసింది. అయితే సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..