Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌

ఈ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం...

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌
Rain Alert
Follow us

|

Updated on: Aug 29, 2024 | 7:14 AM

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను అలర్ట్‌ చేసింది వాతావారణ శాఖ. రానున్న రోజుల్లో భారీ, నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తూర్పు-మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 5.8 కి..మీ ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తూర్పు-మధ్య మరియు పరిసర ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కారణంగా తెలంగాణలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. కొన్ని చోట్ల ఉరుములు , మెరుపులతో గంటకు 40 నుండి 50 కి. మీ. వేగంతో అక్కడ అక్కడ వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీలో అతిభారీ వర్షాలు..

ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నాలుగురోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం కారణంగా.. తూర్పు మధ్య, ఉత్తర బంగాళా ఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం వచ్చే 2 రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ కారణంగా నార్త్‌ కోస్టల్‌లో ఒకటి, రెండు ప్రదేశాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో గురువారం.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. ఇక శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాల చోట్ల కురిసే అవకాశముంది.

ఇక దక్షిణ కోస్తా విషయానికొస్తే.. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాకాశముంది. రాయలసీమ విషయానికొస్తే.. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది. శుక్రవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది. శనివారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
2,280 జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సర్కార్‌ గ్రీన్ సిగ్నల్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
రేస్ లో నుండి తప్పుకున్న కంగువ !! సోలోగా రానున్న సూపర్ స్టార్
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
మరోసారి 'డీప్ ఫేక్’ బారిన కింగ్ కోహ్లీ.. ఏకంగా అలా చూపించారేంటి?
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
గూడ్స్‌ రైలు కింద పడ్డ మహిళ.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌.! వీడియో
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
ప్రగ్యా నయ పిక్స్ చూస్తే ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..
నాకు ఫ్లాప్స్ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూశారు..
ఒక్క 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. గుట్టలాంటి పొట్టైనా కరగాల్సిందే..
ఒక్క 5 నిమిషాలు ఈ ఆసనం వేస్తే.. గుట్టలాంటి పొట్టైనా కరగాల్సిందే..
జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్..
జియో యూజర్లకు అంబానీ అద్దిరిపోయే న్యూస్..
హైడ్రా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
మాంసం కోసం 900 ఏనుగులు, జీబ్రాలు చంపేందుకు సర్కార్ ఉత్తర్వులు
మాంసం కోసం 900 ఏనుగులు, జీబ్రాలు చంపేందుకు సర్కార్ ఉత్తర్వులు