Today Gold Price: మళ్లీ చుక్కలు చూపిస్తోన్న బంగారం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?

గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరుగుతోంది. మొన్నటికి మొన్న తులం బంగారం ధర రూ. 70 వేలకు చేరువ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. క్రమంగా గోల్డ్ రేట్స్‌ పెరుగుతున్నాయి....

Today Gold Price: మళ్లీ చుక్కలు చూపిస్తోన్న బంగారం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
Gold Price Latest
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 29, 2024 | 6:31 AM

గత కొన్ని రోజులుగా కాస్త శాంతించిన బంగారం ధరలో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరుగుతోంది. మొన్నటికి మొన్న తులం బంగారం ధర రూ. 70 వేలకు చేరువ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. క్రమంగా గోల్డ్ రేట్స్‌ పెరుగుతున్నాయి. మరి ప్రస్తుతం గురువారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,310కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,410 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 గా ఉంది.

* ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

* కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,160, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,260గా ఉంది.

* విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,160కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,260 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగితే వెండి ధరలో తగ్గుదల కనిపించింది. గురువారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి కోల్‌కతా, పుణె నగరాల్లో కిలో వెండి ధర రూ. 88,400గా ఉంది. కాగా చెన్నై, కేరళ, హైదరాబాద్‌తోపాటు విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 93,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…