Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు.. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు

ఏపీ ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు.. ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు
Heavy Rains In Telangana
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 23, 2021 | 6:33 AM

ఏపీ ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, ఇవాళ, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అటు ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిశాయి. ఇవాళ కూడా రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

అనంతపురం, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యుత్తు, రెవెన్యూ, వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: Aadhaar Card: ఈ సంగతి మీకు తెలుసా.. మీ ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్స్ తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి …

CA Exams 2021: ఫైనల్, ఇంటర్ పాత కోర్సు పరీక్షలు రాసేవారికి గుడ్ న్యూస్.. చివరి ప్రయత్నంగా మరో అవకాశం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!