AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: ఇదేంటి భయ్యా.. మళ్లీ వానలా.. తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్

తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది.

Rain Alert: ఇదేంటి భయ్యా.. మళ్లీ వానలా.. తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్
Telangana Rains
Anand T
|

Updated on: Nov 03, 2025 | 3:12 PM

Share

హైదరాబాద్‌ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఆదివారం విదర్భ దాని సమీపంలోని మరత్వాడ ప్రాంతంలో కొనసాగిన ఉపరితల చక్రవాత ఆవర్తనం సోమవారం నాటికి బలహీనపడింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేసింది.

అయితే ఇప్పటికే హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమ, మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అలాగే రాష్ట్రంలోని కొన్ని పశ్చిమ జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుంచి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇలాంటి నష్టం మరోసారి జరగకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పంట పొలాల వద్ద కల్లాల్లో ధాన్యం ఉంటే వాటిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు. అలాగే వర్షాల సమయంలో విద్యుత్‌ స్తంభాలు విరిగి పడే అవకాశం ఉందని.. పొలాలకు వెళ్లేప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు సరైన భంగిమలోనే పడుకుంటున్నారా.. చెక్​ చేసుకోండి!
మీరు సరైన భంగిమలోనే పడుకుంటున్నారా.. చెక్​ చేసుకోండి!
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..