AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep Position: ఏ పొజిషన్‌లో పడుకుంటున్నారు! గురక, ముడతలకు కారణం కావొచ్చు.. జాగ్రత్త

నిద్ర శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, మన శరీరం మరమ్మత్తులు చేసుకునే సమయం. ప్రతి ఒక్కరూ రోజూ కచ్చితంగా తగినంత సమయం నిద్రపోవాలి. అయితే, నిద్రపోయేటప్పుడు మనం ఎంచుకునే భంగిమ మన ఆరోగ్యానికి, శరీరంపై ఒత్తిడికి చాలా కీలకం. చాలా మంది సౌకర్యంగా ఉన్న ..

Sleep Position: ఏ పొజిషన్‌లో పడుకుంటున్నారు! గురక, ముడతలకు కారణం కావొచ్చు.. జాగ్రత్త
Sleeping Position
Nikhil
|

Updated on: Dec 14, 2025 | 12:49 PM

Share

నిద్ర శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు, మన శరీరం మరమ్మత్తులు చేసుకునే సమయం. ప్రతి ఒక్కరూ రోజూ కచ్చితంగా తగినంత సమయం నిద్రపోవాలి. అయితే, నిద్రపోయేటప్పుడు మనం ఎంచుకునే భంగిమ మన ఆరోగ్యానికి, శరీరంపై ఒత్తిడికి చాలా కీలకం. చాలా మంది సౌకర్యంగా ఉన్న పొజిషన్‌లో పడుకుంటారు, కానీ ప్రతి భంగిమలోనూ కొన్ని లాభాలు, నష్టాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు ఏ భంగిమలో నిద్రిస్తే ఎలాంటి లాభాలు, నష్టాలు ఉంటాయో తెలుసుకుని, శరీరంపై భారం పడకుండా జాగ్రత్త పడటం అవసరం.

వెల్లకిలా నిద్రించడం

వెల్లకిలా నిద్రించే భంగిమ (సోల్జర్ పొజిషన్)ను ఉత్తమమైనదిగా భావిస్తారు. యోగాలో దీనిని శవాసనం అని కూడా అంటారు. ఈ భంగిమలో వెన్నెముకకు విశ్రాంతి, మెడ, చేతులకు బలం, శరీర భంగిమ మెరుగు, అసిడిటీ తగ్గుదల, ముఖంపై ముడతలు రాకుండా నివారణ, నిద్రలేమి సమస్య దూరం అవుతాయి. కానీ ఈ భంగిమలో పడుకుంటే గురక ఎక్కువగా రావచ్చు, గర్భిణులకు కడుపులోని పిండంపై ప్రభావం చూపుతుంది, వెన్నెముక కింది భాగంలో నొప్పి రావచ్చు. తల కింద దిండు లేకుండా నిద్రించాలి.భుజాలు, వెన్నునొప్పి రాకుండా చూసుకోవాలి.

పక్కకు తిరిగి నిద్రించడం

పక్కకు తిరిగి పడుకునే భంగిమలు చాలా సాధారణం. ప్రతి భంగిమ దానిదైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఒకవైపు తిరిగి, చేతులు శరీరానికి ఆనించి పడుకునే లాగ్ పొజిషన్ వల్ల వెన్ను నొప్పి, మెడ నొప్పి తగ్గుతాయి, గురక సమస్య ఉండదు, గర్భిణీలకు మంచిది. కానీ తొడల నొప్పి, చర్మంపై ముడతలు రావడం, వక్షోజాలు సాగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. మెడ కింద పెద్ద తలదిండు, తొడల మధ్య మరో దిండు పెట్టుకుని నిద్రించాలి.

కాళ్లు ముడుచుకుని..

దీనినే పీటల్​ పొజిషన్​ అంటారు. దీనివల్ల గురక తగ్గుతుంది, గర్భిణీలకు చాలా మంచిది, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు. కానీ, మెడ, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది, చర్మంపై త్వరగా ముడతలు, వక్షోజాలు సాగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. తల కింద కచ్చితంగా దిండు ఉండాలి, రాత్రిపూట అటు, ఇటు పక్కలకు తిరుగుతూ నిద్రించాలి.

బోర్లా పడుకోవడం

పొట్టపై బోర్లా పడుకోవడం చాలా మందికి సౌకర్యంగా ఉన్నా, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల గురక సమస్య ఉండదు కానీ వెన్నెముక, మెడ నొప్పి, రక్త సరఫరాలో ఆటంకాలు, ముఖంపై ముడతలు ఏర్పడడం, అంతర్గత అవయవాలపై ఒత్తిడి పడడం వంటి సమస్యలు వస్తాయి. ఈ పొజిషన్లో పడుకునేటప్పుడు పొట్టకు, పరుపుకు మధ్య దిండు పెట్టుకుని నిద్రించాలి.

ప్రతి ఒక్కరూ తమకు సౌకర్యవంతమైన భంగిమలో, శరీరంపై ఒత్తిడి పడకుండా నిద్రించడానికి ప్రయత్నించాలి. ఏ భంగిమలో సమస్యలు వస్తున్నాయో తెలుసుకుని, దిండును సరిగ్గా ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

మీరు సరైన భంగిమలోనే పడుకుంటున్నారా.. చెక్​ చేసుకోండి!
మీరు సరైన భంగిమలోనే పడుకుంటున్నారా.. చెక్​ చేసుకోండి!
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..