- Telugu News Photo Gallery Leftover Roti recipes: 7 mouth watering fast foods to make with your humble chapati
Leftover Roti recipes: మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
చాలా మందికి రోజులో ఒక్కపూట అయినా చపాతీలు తీసుకోవడం అలవాటు. అయితే ఒక్కోసారి అందరూ భోజనం చేసిన తర్వాత చపాతీ మిగిలిపోతుంటాయి. దీనివల్ల వాటిని వృద్ధాగా పడేస్తుంటాం. కానీ ఇలి మిగిలిపోయిన చపాతీలను పారవేయకుండా.. వాటితో రుచికరమైన రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.
Updated on: Dec 14, 2025 | 12:31 PM

చాలా మందికి రోజులో ఒక్కపూట అయినా చపాతీలు తీసుకోవడం అలవాటు. అయితే ఒక్కోసారి అందరూ భోజనం చేసిన తర్వాత చపాతీ మిగిలిపోతుంటాయి. దీనివల్ల వాటిని వృద్ధాగా పడేస్తుంటాం. కానీ ఇలి మిగిలిపోయిన చపాతీలను పారవేయకుండా.. వాటితో రుచికరమైన రకరకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు.

చపాతీతో పోహా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా చపాతీని చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయ, మిర్చి, ఆవాలు, కరివేపాకు వేయించి, చపాతీ ముక్కలు వేసి కలపాలి. తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం వేస్తే చపాతీ పోహా సిద్ధం అయినట్లే.

మీరు చపాతీ రోల్స్/ఫ్రాంకీలు కూడా చేసుకోవచ్చు. ముందుగా చపాతీని వేడి చేసి, చపాతీ మీద సాస్, మాయో లేదా చట్నీని చల్లి, ఆపై కూరగాయలు, పనీర్ లేదా కాల్చిన బంగాళాదుంపలతో నింపి రోల్ తయారు చేసుకోవాలి. అంతే చపాతీ రోల్స్ తినడానికి సిద్ధంగా ఉంటాయి.

చపాతీతో చిప్స్ కూడా చేయవచ్చు. చపాతీలను సన్నని ముక్కలుగా కోసి... తర్వాత వాటిని నూనెలో వేయించాలి. క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. వేయించిన తర్వాత ఉప్పు, చాట్ మసాలా చల్లితే రుచికరమైన చిప్స్ తయారైనట్లే.

అలాగే చపాతీ లడ్డులు కూడా చేసుకోవచ్చు. చపాతీని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత నెయ్యి, బెల్లం లేదా చక్కెర, డ్రై ఫ్రూట్స్ చపాతీ పిండిలో వేసి చూర్ణం చేసి లడ్డులుగా చుట్టాలి. ఈ లడ్డులు తినడానికి రుచికరంగా ఉంటాయి.