Megha Gas station: గ్యాస్ పంపిణీలో మేఘా సంస్థ మరో మైలు రాయి.. వరంగల్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌

మేఘా.. నమ్మకానికి మారుపేరు. ఇప్పటికే మౌలిక నిర్మాణ రంగంలో అప్రతిహాసంగా దూసుకుపోతున్న మేఘా సంస్థ.. మరో ప్రాజెక్టుతో ముందుకొచ్చింది.

Megha Gas station: గ్యాస్ పంపిణీలో మేఘా సంస్థ మరో మైలు రాయి.. వరంగల్‌లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సిటీ గేట్‌ స్టేషన్‌
Megha Gas Station Expands To Warangal
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 12, 2021 | 9:43 PM

Megha Gas station expands to warangal: మేఘా.. నమ్మకానికి మారుపేరు. ఇప్పటికే మౌలిక నిర్మాణ రంగంలో అప్రతిహాసంగా దూసుకుపోతున్న మేఘా సంస్థ.. మరో ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. గ్యాస్‌, పెట్రోల్‌ రేట్లతో ప్రజలకు పెనుభార అయిన సమయంలో.. మేఘా గ్యాస్‌ అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ ధరలతో సేవలను ప్రారంభించింది. వరంగల్ లో తొలి CNG స్టేషన్ ప్రారంభించింది.

తెలంగాణలో మేఘా గ్యాస్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో తన సేవలు ఆరంభించిన మేఘా గ్యాస్ ప్రస్తుతం వరంగల్ జిల్లాలో కూడా కార్యకలాపాలను ప్రారంభించింది. వరంగల్ జిల్లాలో తొలి CNG స్టేషన్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిటైల్ సేల్స్ విభాగం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం ధర్మారావు వరంగల్ భూపాలపల్లి రహదారిలో డీజిల్ కాలనీలో శ్రీరామ ఫిల్లింగ్ స్టేషన్‌లో ప్రారంభించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 24 CNG స్టేషన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మేఘా సంస్థ సంకల్పించింది.

ఈ కార్యక్రమంలో IOCL ఇంజనీరింగ్ విభాగం చీఫ్ మేనేజర్ హరి ప్రసాద్, రిటైల్ సేల్స్ మేనేజర్ కిషోర్ , మేఘా గ్యాస్ రిటైల్ సేల్స్ మేనేజర్ దేవా చంద్రశేఖర్, టెక్నికల్ మేనేజర్ రాజ్‌కుమార్, సైట్ ఇంచార్జి రాజేష్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంటింటికి పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేయటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ విక్రయాలను మేఘా గ్యాస్ కొద్దీ రోజుల క్రితం ప్రారంభించింది. వరంగల్ జిల్లాలో వాహనాలకు వినియోగించే గ్యాస్ విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపధ్యంలో గ్యాస్ వినియోగం వల్ల వాహన యజమానులకు ఖర్చు ఆదా అవుతుందన్నారు మేఘా గ్యాస్ ప్రతినిధి దేవా చంద్ర. త్వరలో వరంగల్ సెంట్రల్ జైలు సమీపంలో, రంగారెడ్డి జిల్లా జిల్లా శంషాబాద్, వికారాబాద్ జిల్లాలో మరో CNG స్టేషన్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఇదిలావుంటే, సీజీడీ (CGD) – నల్గొండ ప్రాజెక్ట్‌లో భాగంగా నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో సహజవాయువు సరఫరాలో కీలకమైన ‘సిటీ గేట్‌ స్టేషన్‌’ CGS (సీజీఎస్‌) మదర్‌ స్టేషన్‌ను ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్యాస్‌ సరఫరా సేవలను అందిస్తోంది మేఘా సంస్థ. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పటికే 32 కిలో మీటర్లు స్టీల్‌ పైప్‌ లైన్‌ వేయగా, మరో 80 కిలోమీటర్ల పైప్‌ లైన్‌ పనులు కొనసాగుతున్నాయి. 40 వేల కుటుంబాలకు, పరిశ్రమలకు గ్యాస్‌ సరఫరా చేసే ఉద్దేశ్యంతో ఇంకా 500 కిలో మీటర్ల పొడవు గల ఎండీపీఈ (MPDE) పైప్‌ లైన్‌ నిర్మాణం చేపట్టింది.

అటు, ఆంధ్రప్రదేశ్‌లోని మేఘా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా త్వరలో నందిగామలో కూడా తమ స్టేషన్ ప్రారంభం అవుతుందన్నారు. వాహనాలకు CNG వాడకం వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. కాలుష్యం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిని తగ్గించటంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు.

కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చడం తోపాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్‌ గ్యాస్‌ CNGని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ ‘స్మార్ట్ – ఇట్స్ గుడ్‌ ‘ పేరుతో గ్యాస్ ను సరఫరా చేస్తోంది.

Read Also…  యజమానిని ప్రపంచ రికార్డులకెక్కించిన బర్గర్‌..!! ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!! ( వీడియో )