AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామం ఎక్కడో తెలుసా?

గతవారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక చివరకు ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇవాళ ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రియాంక స్వగ్రామమైన జోగులాంబ గద్వారా జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్‌ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు కుటుంబ సభ్యులు.

Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఆమె స్వగ్రామం ఎక్కడో తెలుసా?
Medico Priyanka Last Rites In Native Village
Anand T
|

Updated on: Aug 10, 2026 | 8:56 AM

Share

రాజమండ్రిలో ప్రమాదానికి గురైన.. సుమారు ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన మెడికో ప్రియాంక అంతక్రియలు నేడు జరగనున్నాయి. ఆమె స్వాగ్రామమైన జోగులాంబ గద్వారా జిల్లా ఐజ మండలం ఏక్లాస్‌పూర్‌ గ్రామంలో ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం ప్రియాంక బాడీని స్వగ్రామానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. దాదాపు మధ్యాహ్నంలోపు ప్రియాంక డెడ్‌బాడీ తన ఇంటికి చేరుకోనుంది. ఆ తర్వాత అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అయితే ప్రియాంక సొంతగ్రామం ఏక్లాస్ పూర్.. ఆమె రెండో తరగతి వరకు ఏక్లాస్‌ పూర్ మండలమైన ఐజలో విద్యాభ్యాసం చేసింది. ఆ తర్వాత పిల్లల చదువుల కోసమని ప్రియాంక తల్లిదండ్రులు కర్నూల్‌లో స్థిరపడ్డారు. దీంతో అక్కడే మిగతా చదువును ఆమెను కంటిన్యూ చేసింది. అయితే ప్రియాంక చిన్నప్పటి నుంచే చదువులో బాగా రాణించేది. ప్రియాంకకు ఇద్దరు చెల్లెల్లు కూడా ఉన్నారు.. ఆమె పెద్ద కూతురు కావడంతో కష్టపడి చదివి మెడిసిన్‌లో సీటు సాధించి, ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని GSL మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చేస్తున్న ప్రియాంక ఇటీవల తన స్నేహితుడితో కలిసి.. రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసేందు వెళ్లి వస్తుండగా.. మధ్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కార్‌తో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో ఉన్న కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిందిజ

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
ఈ రంగుల గొట్టం కేవలం అలంకారం కాదు.. అసలు సీక్రెట్ ఇదే..!
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
అమెరికాలో నీల్గాయ్‌ల రచ్చ.. అధికారులకు నిద్రలేని రాత్రులు
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
ఇవాళ పిడుగులు, ఉరుములతో వర్షాలు.. బయటకు రావొద్దంటూ హెచ్చరికలు!
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.