AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beetroot Halwa: బ్లడ్ పట్టే హెల్దీ అండ్ టేస్టీ బీట్‌రూట్ హల్వా.. చుక్క ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

బీట్‌రూట్‌లో ఐరన్, పొటాషియం మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత తో బాధపడేవారు రోజూ కొద్దిగా బీట్‌రూట్ తీసుకుంటే రక్తకణాలు వేగంగా పెరుగుతాయి. అయితే చాలామంది పిల్లలు బీట్‌రూట్ ముక్కలను లేదా కర్రీలను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడకుండా, ఎంతో కమ్మటి 'బీట్‌రూట్ హల్వా' తయారు చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు.

Phani CH
|

Updated on: Aug 09, 2026 | 9:38 PM

Share
కరాచీ హల్వా లేదా బొంబాయి హల్వా తరహాలోనే జెల్లీ లాగా సాఫ్ట్‌గా ఉండే ఈ బీట్‌రూట్ హల్వా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఈ బీట్‌రూట్ హల్వా తయారీకి ముందుగా ఒక పావు కేజీ తాజా బీట్‌రూట్‌ను శుభ్రం చేసి తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.

1 / 5
మిక్సీ జార్‌లో బీట్‌రూట్ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుని జల్లెడలో వడకట్టి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. వడకట్టిన పల్ప్‌ను మరోసారి కొద్దిగా నీళ్లు పోసి తిప్పి మళ్లీ రసం తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకుని, రెండు కప్పుల బీట్‌రూట్ రసాన్ని పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.

2 / 5
కడాయిలో రెండు కప్పుల పంచదార, అర కప్పు నీళ్లు పోసి మరిగించి ఒక తీగ పాకం రానివ్వాలి. పాకం గట్టిపడకుండా చిటికెడు నిమ్మ ఉప్పు వేసి, తయారు చేసిన బీట్‌రూట్-కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పోసి మీడియం ఫ్లేమ్‌పై నిరంతరం కలుపుతూ ఉండాలి.

3 / 5
రెండు నిమిషాల్లో మిశ్రమం దగ్గరపడి జెల్లీలా మారుతుంది. అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ, పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. హల్వా దగ్గరపడి నెయ్యి వేరవుతున్నప్పుడు జీడిపప్పు, బాదం, పుచ్చపప్పు పలుకులు వేసి మిక్స్ చేయాలి.

4 / 5
నెయ్యి రాసిన ట్రేలో నువ్వులు చల్లి, ఈ హల్వా మిశ్రమాన్ని పరిచి రెండు గంటలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే అమృతతుల్యమైన బీట్‌రూట్ హల్వా సిద్ధమవుతుంది. నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మటి 'బీట్‌రూట్ హల్వా'  రక్తహీనతతో బాధపడేవారికి మరియు పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది.

5 / 5
Follow Us