AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఛీ.. అక్కడెలా దాచావ్‌రా.. బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అసలు ఈ అక్రమ రవాణా చేసేవారికి ఈ ఐడియాలు ఎలా వస్తాయో అస్సలు అర్థం కాదు. ఎయిర్‌పోర్టులో అన్ని రకాల చెకింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎవరికీ చిక్కకుండా ఈజీగా వాటిని దాటేస్తుంటారు. కొన్నిసార్లు అడ్డంగా బుక్కవుతుంటారు. తాజాగా ఇలానే జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. అతను బంగారం ఎక్కడ దాచి తెచ్చాడో తెలిస్తే.. మీరు నోరెళ్లబెట్టక తప్పదు.

Viral Video: ఛీ.. అక్కడెలా దాచావ్‌రా.. బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Ahmedabad Airport Gold Smuggling
Anand T
|

Updated on: Aug 10, 2026 | 7:11 AM

Share

బంగారం, డ్రగ్స్ వంటివి బాడీ లోపల దాచి తీసుకొచ్చే దృశ్యాలను మనం ఇప్పటివరకు కేవలం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. ఇవన్నీ రియల్ లైఫ్‌లో సాధ్యం కావు అని అనుకుంటాం. అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే తాజాగా అలాంటి ఘటన ఒకటి అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు బంగారాన్ని ముద్దగా మార్చి తన మలద్వారంలో దాచి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఎయిర్ చెకింగ్ సమయంలో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

మలద్వారంలో అరకేజీ బంగారం!

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో సర్ఫరాజ్‌ మాలా అనే 24 ఏళ్ల యువకుడు జెడ్డా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. టెర్మినల్‌ నుంచి బయటకు వెళ్తున్న క్రమంలో చెకింగ్ వద్ద అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు మెటల్ డిటెక్టర్‌తో స్కాన్ చేయగా షాకింగ్ విషయం బయటకొచ్చింది. అతను తన మలద్వారంలో బంగారాన్ని కడ్డీగా మార్చి దాచి తరలిస్తున్నట్టు గుర్తించారు.

రూ.65.69 లక్షల విలువైన బంగారం స్వాధీనం!

దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని వైద్యుల సహాయంతో మలద్వారంలో దాచి తరలిస్తున్న బంగారాన్ని బయటకు తీశారు. సుమారు 467.09 గ్రాములు (దాదాపు అరకిలో) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్‌లో రూ.65.69 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!
అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. ఇవి తింటే ఎముకలు ఉక్కులా
అరకిలో మటన్, పాలు తాగినా రాని శక్తి.. ఇవి తింటే ఎముకలు ఉక్కులా
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు
సోమవారం శివుడిని పూజించి ఈ వస్తువులు దానం చేయండి.. చంద్ర దోషం..
సోమవారం శివుడిని పూజించి ఈ వస్తువులు దానం చేయండి.. చంద్ర దోషం..
ఒక్క గ్లాస్ తాగితే.. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు ఒక్క రోజులోనే మాయం
ఒక్క గ్లాస్ తాగితే.. మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు ఒక్క రోజులోనే మాయం
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే..