AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు

తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరోవారం పాటు వానలే వానలు
Telangana Rains
Srilakshmi C
|

Updated on: Aug 10, 2026 | 6:09 AM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ఆదివారం నాటికి ఈశాన్య మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగే పరిస్థితులు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

పలు జిల్లాల్లో వర్షాలు

ఆదివారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్‌, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాల సమయంలో ప్రయాణాలు చేసేవారు వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం, ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో వచ్చే వారం రోజుల పాటు వాతావరణం సాధారణంగా మేఘావృతంగా ఉండటంతో పాటు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.

Follow Us