AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..

సాధారణంగా సినిమాలో హీరోయిన్స్ మాత్రమే కాదు.. కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం ఫేమస్ అవుతుంటారు. అలాగే మరికొందరు స్పెషల్ పాటలతో పాపులర్ అవుతారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం తగ్గదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి సైతం ఆ జాబితాలోకి చెందినవారే. అప్పట్లో తెలుగులో ఆమె ఓ సెన్సేషన్ అనే చెప్పాలి.

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
Alphonsa
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2026 | 7:54 AM

Share

మాస్ మహారాజా రవితేజ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఒకటి. ఆసిన్ కథానాయికగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులోని స్పెషల్ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది. జుమ్ జుమారే అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఏ రేంజ్ లో దుమ్మురేపిందో చెప్పక్కర్లేదు. ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈ పాటలో ఆలితోపాటు డ్యాన్స్ స్టెప్పులతో అదరిగొట్టిన నటి గుర్తుందా.. ? ఆమె పేరు ఆల్ఫోన్సా. చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె.. పై బ్రదర్స్ సినిమాతో మలయాళంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బాషా సినిమాలో రా రా రామయ్య అనే పాటతో ఓ ఊపు ఊపేసింది. ఈ పాట ఆమెకు బ్రేక్ ఇచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..

ఆ తర్వాత తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దొంగాట, ప్రేమించుకుందాం రా, శుభాకాంక్షలు, మా పెళ్లికి రండి, మురారి, మహానంది వంటి చిత్రాల్లో మెరిసింది. అంతేకాకుండా అనేక హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు, తమిళం, మలాయళం భాషలలో అనేక సినిమాల్లో నటించిన ఆల్ఫోన్సా 2013లో పోలీస్ మమన్ సినిమా తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..

ఇక ఆల్ఫాన్సా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె తమ్ముడు యాక్టర్ కమ్ కొరియోగ్రాఫర్. అతడి పేరు రాబర్ట్. తమిళంలో పలు చిత్రాల్లో నటించాడు. 2001లో తన కో యాక్టర్ నజీర్ ను పెళ్లి చేసుకున్న ఆల్ఫోన్సా.. కొంతకాలానికే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వినోద్ అనే వ్యక్తితో రెండేళ్లపాటు లివ్ ఇన్ రిలేషన్ లో ఉంది. కానీ 2012లో అతడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అదే ఏడాది ఆల్ఫోన్సా సైతం సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి రక్షించారు. ప్రస్తుతం ఆల్ఫోన్సా ఒంటరిగానే ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

ఆల్ఫోన్సా..

Alphonsa Latest

Alphonsa Latest

ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..

Follow Us