AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి..

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు RITES గుడ్‌న్యూస్‌ చెప్పింది. అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..

RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి..
RITES Assistant Manager Recruitment
Srilakshmi C
|

Updated on: Aug 10, 2026 | 7:53 AM

Share

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఆగస్టు 17, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో ఫుల్‌టైమ్ బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. మెకానికల్‌, ప్రొడక్షన్‌, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, మెకానికల్/రైల్వేస్‌, మెకాట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ కాంబినేషన్‌తో డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 50 శాతంగా ఉంది. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్ట్ 17, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించవల్సి ఉంటుంది. జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.300 చొప్పున తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. తుది ఎంపికలో రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ కేటాయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేయడానికి ముందు విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్‌, ఫీజు, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించాలి. మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం RITES అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవి కూడా చదవండి

RITES ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
స్పెషల్ పాటతో ఊర్రూతలూగించిన ఈ నటి గుర్తుందా.. ?
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో..
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
వార్మప్‌తో ఆ ఇద్దరు ఔట్.. లంకతో తొలి టెస్ట్‌కు భారత జట్టు ఇదే..?
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఎలా వస్తాయ్ రా ఈ ఐడియాలు.. బంగారం స్మగ్లింగ్ ఎలా చేశాడో తెలిస్తే.
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
ఓర్నీ.. ఇన్ని రోజులు గుడ్డిగా తాగేశామా.. పాలు వీరికి యమడేంజర్..
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
6,6,6,6,4.. 213 స్ట్రైక్‌రేట్‌తో టెస్ట్ ఫార్మాట్‌కే చుక్కలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బంగారం కొనే వారికి బిగ్‌ రిలీఫ్.. మళీ తగ్గుతున్న పసిడి ధరలు
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!
బన్నీ ప్రయాణించిన కారు అదేనా.. సోషల్ మీడియాలో వైరల్..!