AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..

వంటగదిలో రోజూ మనల్ని విసిగించే అతిపెద్ద సమస్యల్లో నల్లగా మారిన గ్యాస్ బర్నర్లు ఒకటి. పాలు పొంగడం, నూనె జిడ్డు పేరుకుపోవడం వల్ల బర్నర్ల రంధ్రాలు మూసుకుపోయి మంట సరిగ్గా రాక గ్యాస్ ఎక్కువ వృథా అవుతుంటుంది. వాటిని తోమి తోమి చేతులు నొప్పులు పుడుతున్నాయా? అయితే ఇకపై ఆ శ్రమ అక్కర్లేదు. ఇంట్లో దొరికు పదార్థాలతో గ్యాస్ బర్నర్లను నిమిషాల్లో కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో తెలుసుకుందాం..

రుద్దే పనిలేదు.. తోమే అవసం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో గ్యాస్ బర్నర్లు మిలమిల మెరవాల్సిందే..
How To Clean Gas Stove Burners In 5 Minuts
Krishna S
|

Updated on: Aug 10, 2026 | 7:30 AM

Share

వంటగదిలో ఏం పని చేయాలన్నా గ్యాస్ స్టవ్ ఉండాల్సిందే. గ్యాస్ లేకపోతే అస్సలు పనే కాదు. అయితే రోజూ వంట చేసేటప్పుడు పాలు పొంగడం, నూనె చిందడం లేదా ఆహార పదార్థాలు మాడిపోవడం వల్ల గ్యాస్ బర్నర్లు నల్లగా మారడమే కాకుండా వాటిలోని చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోతుంటాయి. దీనివల్ల మంట సరిగ్గా రాక గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా వంట చేయడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ బర్నర్లను గంటల తరబడి రుద్ది తోమడం పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ ఎలాంటి రుద్దే అవసరం లేకుండా ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతోనే గ్యాస్ బర్నర్లను నిమిషాల్లో కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో తెలుసుకోవడం మహిళలకు ఎంతో ముఖ్యం.

ఈనో అండ్ నిమ్మరసం చిట్కా

గ్యాస్ బర్నర్లపై ఉండే మొండి నల్లదనాన్ని, పేరుకుపోయిన జిడ్డును వదిలించడానికి ఈనో ప్యాకెట్, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకుని అందులో ఒక ప్యాకెట్ ఈనో పొడి, ఒక చెంచా వంటసోడా, ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఈ మిశ్రమంలో నల్లబడిన గ్యాస్ బర్నర్లను ముంచి దాదాపు 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే నానబెట్టాలి. ఈనో, నిమ్మరసంలోని యాసిడ్ చర్య వల్ల బర్నర్లకు పట్టిన జిడ్డు, పొగ మసి క్షణాల్లో వదిలిపోతాయి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగితే బర్నర్లు కొత్తవాటిలా మెరుస్తాయి.

వినెగర్ అండ్ బేకింగ్ సోడా

వంటగది శుభ్రతలో వినెగర్, బేకింగ్ సోడాల కాంబినేషన్ క్లీనింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఒక పాత్రలో వినెగర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో గ్యాస్ బర్నర్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయానికి బర్నర్ల రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి మొత్తం వదిలిపోతుంది. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో తేలికగా తుడిచి కడిగితే సరిపోతుంది.

నిమ్మకాయ అండ్ ఉప్పు

రసాయనాలు ఏవీ వాడకుండా కేవలం సహజ పద్ధతిలో శుభ్రం చేయాలనుకునే వారికి నిమ్మకాయ, ఉప్పు మంచి ఉపాయం. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, దానిపై కాస్త ఉప్పు చల్లాలి. ఈ నిమ్మచెక్కతో బర్నర్లపై రుద్దడం వల్ల ఉప్పు స్క్రబ్బర్‌లా, నిమ్మరసం జిడ్డును వదిలించే క్లీనర్‌లా పనిచేస్తాయి. 5 నిమిషాల పాటు రుద్ది వేడి నీళ్లతో కడిగేస్తే బర్నర్లు శుభ్రపడతాయి.

బర్నర్లు శుభ్రంగా ఉంటే కలిగే ప్రయోజనాలు

గ్యాస్ ఆదా: రంధ్రాల్లో మురికి తొలగిపోవడం వల్ల మంట నీలిరంగులో సమానంగా వస్తుంది. దీనివల్ల గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది.

సమయం ఆదా: మంట సరిగ్గా రావడం వల్ల వంట వేగంగా పూర్తవుతుంది.

సురక్షితం: గ్యాస్ లీకేజీలు, అసమాన మంట వల్ల అయ్యే ప్రమాదాలను అరికట్టవచ్చు.

చిన్న చిట్కా: బర్నర్లను కడిగిన తర్వాత వెంటనే స్టవ్‌పై పెట్టకుండా, పొడి గుడ్డతో బాగా తుడిచి పూర్తిగా ఆరిన తర్వాతే అమర్చుకోవాలి.

Follow Us
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం