Khammam: మావోలకు వ్యతిరేకంగా ఆదివాసీల భారీ ర్యాలీ.. మా గ్రామాల్లోకి రావొద్దు.. మమ్మల్ని బ్రతక నివ్వండి అంటూ విజ్ఞప్తి..
ఆదివాసీలు పెద్ద ఎత్తున చిన్నపిల్లలతో సహా మండల కేంద్రానికి చేరుకొని బ్యానర్లు పట్టుకొని మావోయిస్టులారా మా గ్రామాలకు రావద్దు మమ్మల్ని ఛత్తీస్ ఘడ్ కు పిలవద్దు మేము తెలంగాణ ఆదివాసి గిరిజనులం. దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. మిలీషియా సంఘాలొద్దు ..జనతన సర్కారు వద్దు.. తెలంగాణ సర్కార్ ముద్దు.. మా గ్రామాలకు రావద్దు.. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ బ్యానర్ లు, ఫ్లకార్డు లు ప్రదర్శిస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.

భద్రాచలం ఏజెన్సీ సరిహద్దు లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు.. మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా.. ఇటీవల వారికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు వెలిశాయి. ఇపుడు ర్యాలీ నిర్వహించడం చర్చకు దారి తీసింది. చర్ల మండల కేంద్రంలో మండల పరిధిలోని సరిహద్దు గ్రామాలైన చెన్నపురం, వీరాపురం, బట్టిగూడెం, ఆర్లగూడెం, తదితర గ్రామాల నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున చిన్నపిల్లలతో సహా మండల కేంద్రానికి చేరుకొని బ్యానర్లు పట్టుకొని మావోయిస్టులారా మా గ్రామాలకు రావద్దు మమ్మల్ని ఛత్తీస్ ఘడ్ కు పిలవద్దు మేము తెలంగాణ ఆదివాసి గిరిజనులం. దయచేసి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనివ్వండి. మిలీషియా సంఘాలొద్దు ..జనతన సర్కారు వద్దు.. తెలంగాణ సర్కార్ ముద్దు.. మా గ్రామాలకు రావద్దు.. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ బ్యానర్ లు, ఫ్లకార్డు లు ప్రదర్శిస్తూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.
చర్ల బస్టాండ్ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకొని చర్ల మండల తహసిల్దార్ రంగు రమేష్ కు వివిధ సమస్యలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. ఇప్పటివరకు అక్కడక్కడ చాటుమాటుగా మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. కరపత్రాలు సైతం ప్రచురించారు. అవి పోలీసులే అంటించారని.. కరపత్రాలు పంచారని మావోయిస్టులు కొట్టి పారేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారి .. ఆదివాసీలు ఇలా బహిరంగంగా మావోలకు వ్యతిరేకంగా గళమెత్తారు.
మరోవైపు..మూడు రోజులు క్రితం మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు, కర పత్రాలు వెలిశాయి. దుమ్ముగూడెం మండలం లో పలు గ్రామాల్లో ఆదివాసీ సంఘాల పేరుతో కర పత్రాలు వెలిశాయి.. మావోయిస్టుల వలన ఆదివాసీల బ్రతుకులు ఏమి మారాయి.. ఆదివాసులకు ఒరిగిందేమిటి..? మావోయిస్టుల వలన ఆదివాసీలకు సరైన ఉపాధి, విద్య, వైద్యం లేక నష్టపోతున్నాం అంటూ కరపత్రా లో పేర్కొన్నారు. అడవుల్లో బాంబులు అమర్చి పశువులు, మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. మమ్మల్ని బలవంతంగా బెదిరించి.. మావోయిస్టు సభలకు తీసుకు వెళుతున్నారు. మేము అభివృద్ధి చెందేది ఎపుడు అంటూ కర పత్రాల్లో ప్రశ్నించారు. ఆదివాసీ సంఘాలు..ఇటు మావోలు.. అటు పోలీసుల హెచ్చరికలతో ఎపుడు ఏమి జరుగుతుందో అని ఏజెన్సీ లో భయానక వాతావరణం నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..