- Telugu News Photo Gallery Sports photos Asian Games 2023: India Men's Cricket Team Reached Hangzhou, For Their Much Anticipated Campaign
Asian Games 2023: స్వర్ణమే లక్ష్యంగా రుతురాజ్ సారథ్యంలో చైనాలో అడుగు పెట్టిన భారత యువ క్రికెటర్ల బృందం..
ఆసియా గేమ్స్ లో భారత్ క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా ఆసియా గేమ్స్ లో పతకం తమ వంతు అంటూ భారత యువ క్రికెటర్ల జట్టు చైనాలో అడుగు పెట్టింది. ఇంకా చెప్పాలంటే క్రికెట్‌లో భారతదేశానికి రెండవ స్వర్ణ అందించే లక్ష్యంతో రితురాజ్-లక్ష్మణ్ సారధ్యంలోని క్రికెట్ బృందం చైనాలోని హాంగ్‌జౌలో అడుగు పెట్టింది.
Updated on: Sep 28, 2023 | 11:46 AM

ఇప్పటికే భారత మహిళల క్రికెట్ జట్టు 19వ ఆసియా క్రీడల్లో దేశానికి స్వర్ణం తెచ్చిపెట్టింది. ఈసారి స్వర్ణం సాధించడం భారత పురుషుల క్రికెట్ జట్టు వంతు. రుతురాజ్ గైక్వాడ్ బృందం స్వర్ణ పతకమే లక్ష్యంగా హాంగ్జౌ చేరుకున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా సైట్ X భారత క్రికెట్ జట్టు హాంగ్‌జౌ పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలను షేర్ చేసింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి భారత్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత సీనియర్ క్రికెట్ జట్టు సభ్యులు ప్రస్తుత ఆసియా క్రీడలకు వెళ్లలేకపోయారు. అందుకే, 19వ ఆసియా క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు బిసిసిఐ యువ క్రికెటర్ల సమూహాన్ని ఎంపిక చేసింది.

భారత్ టీమిండియా క్రికెటర్లు బుధవారం హాంగ్‌జౌ చేరుకున్నారు. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన సారధ్యంలో మహిళా క్రికెటర్ల బృందం టిటాస్ సాధుర శ్రీలంకను ఓడించి స్వర్ణం గెలుచుకున్నారు. ఇప్పుడు మరో స్వర్ణం సాధించడం భారత పురుషుల క్రికెట్ జట్టు వంతు.

భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో భారత పురుషుల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో ఆడనుంది. రుతురాజ్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 2 మ్యాచ్‌లు ఆడాడు.

జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ 19వ ఆసియా క్రీడలకు భారత జట్టుతో కలిసి చైనా చేరుకున్నారు. భారత ఆసియాడ్ క్రికెట్ ప్రయాణం అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.

యశస్వి జైస్వాల్ చైనాకు చేరుకున్న తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫోటోను పంచుకున్నారు. ఈ ఏడాది వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు పోటీతో అరంగేట్రం చేయగా టీ20 పోటీల్లో ఐర్లాండ్ తో జరిగిన పోటీతో యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేశాడు.

రవి బిష్ణోయ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు ఈసారి ఆసియా క్రీడల్లో క్రికెట్ ఆడుతున్నారు

ఆసియా క్రీడల కోసం చైనాలో ఇప్పటికే ఉన్న బల్లెం వీరుడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాను కేకేఆర్ స్టార్ స్టార్ రింకూ సింగ్ కలిశారు




