AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూసిన రైతుల గుండెలు గుభేల్.. వీడియో ఇదిగో..

పచ్చని వరి చేను.. తీరిక లేకుండా పంట కోతలకు సిద్ధమవుతున్న రైతులు.. సరిగ్గా అదే సమయంలో పొలంలో ఏదో వింత కదలిక.. ఏంటా అని దగ్గరికెళ్లి చూసిన ఆ రైతు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.. పంట దుబ్బుల మధ్య నక్కి కూర్చున్న భారీ మొసలిని చూసి గ్రామం మొత్తం హడలిపోయింది. మెదక్ జిల్లా పాపన్నపేట పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Telangana: వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూసిన రైతుల గుండెలు గుభేల్.. వీడియో ఇదిగో..
Crocodile Spotted In Medak Paddy Field
Krishna S
|

Updated on: Oct 29, 2026 | 4:47 PM

Share

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో తీవ్ర కలకలం రేగింది. ఏనికపల్లి గ్రామంలోని ఓ వరి పొలంలో ఏకంగా భారీ మొసలి ప్రత్యక్షమవడంతో స్థానిక రైతులు, కూలీలు భయాందోళనలకు గురయ్యారు. వరి కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో పొలంలో భారీ మొసలి కనిపించడంతో ఒక్కసారిగా గ్రామమంతా అలజడి మొదలైంది. అయితే అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి, ప్రత్యేక బృందాన్ని రప్పించి మొసలిని సురక్షితంగా పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏనికపల్లి పరిసరాల్లో బుధవారం ఉదయం ఓ రైతు తన వరి పొలంలో పని చేస్తుండగా ఈ మొసలి కనిపించింది. పంట చేల మధ్య కదలికలు గమనించిన సదరు రైతు దగ్గరికెళ్లి చూడగా అది మొసలి అని తేలింది. దీంతో హడలిపోయిన ఆయన వెంటనే మిగతా రైతులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పంట చేలో మొసలి వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

సంగారెడ్డి నుంచి రెస్క్యూ టీమ్.. సురక్షితంగా బంధనం

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి మొసళ్లను పట్టుకోవడంలో అనుభవజ్ఞులైన ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ను రప్పించారు. ఆ బృందం చాకచక్యంగా వలలు, తాళ్ల సాయంతో మొసలికి ఎలాంటి గాయాలు కాకుండా బంధించింది. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మొసలి పట్టుబడటంతో పంట కోతలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు ఊపిరి పీల్చుకున్నారు.

మంజీర నది నుంచి ఎలా వచ్చింది?

సమీపంలో ఉన్న మంజీర నదిలో నీటి మట్టం తగ్గడం లేదా ఆహారం వెతుక్కుంటూ కాల్వల ద్వారా ఈ మొసలి పంట పొలాల్లోకి ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమచందన మాట్లాడుతూ.. మంజీర పరివాహక ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నదీ తీరాల్లో గానీ, చెరువులు, పంట కాలువల సమీపంలో గానీ మొసళ్లు కనిపిస్తే ప్రజలు స్వయంగా పట్టుకునే సాహసం చేయవద్దని, వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా మంజీర నది పరివాహక ప్రాంతంలో మొగ్గర్ జాతి మొసళ్ల సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. ప్రసిద్ధ మంజీర వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోని నదీ ప్రవాహాల నుంచి వరదలు వచ్చినప్పుడు లేదా నీటిమట్టాలు మారినప్పుడు ఇవి సమీప గ్రామాల వైపు రావడం పరిపాటిగా మారింది.

వీడియో చూడండి..

Follow Us
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
వరిచేనులో వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా రైతుల..
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం!
కాలగర్భంలో కలిసిపోయి.. 2,000 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం!
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
ఓటీటీని ఊపేస్తున్న లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అసలు ఆ కథ అతడిదే.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
హైదరాబాద్‌లో బంగారం ధరలు 19 శాతం పతనం.. ఇప్పుడే కొనాలా?
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
కేతువుతో గురువు యుతి..ఈ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
తండ్రి బతికుండగా ఆస్తిలో వాటా అడిగే హక్కు కొడుకులకు ఉండదా..?
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
కొబ్బరికాయను పగలగొట్టకుండా, కోయకుండా నీళ్లు తాగాలి.. ఎలా? ఫజిల్
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
ఆ ఇద్దరి దెబ్బకు మైండ్ బ్లాంక్.. మా ఇద్దరు బౌలర్లు వెళ్లిపోయారు
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
దీపావళి స్వీట్.. బ్రెడ్ హల్వా ఇలా చేస్తే అదిరిపోద్దీ
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?
ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మలో వదలరు.. వీటిని ఇంట్లో ఎలా చేయాలంటే?