Mancherial: సృజన ఎంత పని చేస్తివి.. సజీవ దహనం కేసును రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు..

మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో సజీవ దహనం కేసును మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్టయ్యారు.

Mancherial: సృజన ఎంత పని చేస్తివి.. సజీవ దహనం కేసును రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు..
Illegal Affair
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 21, 2022 | 1:54 PM

మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో సజీవ దహనం కేసును మరోసారి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్టయ్యారు. రెండు ఫోన్లు, రెండు పెట్రోల్ క్యాన్లు, ఒక బొలెరో వాహనంతో పాటు లక్ష రూపాయలకు పైగా నగదు సీజ్ చేశారు. ఏ1 మేడి‌ లక్ష్మణ్, ఏ2 శనిగారపు సృజన, ఏ3 రమేష్‌ను లక్షెట్టిపేటకు తరలించనున్నారు పోలీసులు. శాంతయ్య హత్యకు మారణయుధాలను నిందితుడు రమేష్ తయారు చేయించుకున్నట్టు గుర్తించారు పోలీసులు. ఏ3 రమేష్ నుంచి బొలెరో వాహనం, ఒక కత్తి , ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సుపారీ హత్యకు ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చిన ఏ1 మేడి లక్ష్మణ్ నుంచి ఆధారాలు సేకరించారు. ఏ1 నుంచి ఒక ఫోన్, నగదుతో పాటు భూమి పత్రాలు సీజ్ చేశారు. ఏ4 గా ఉన్న వేల్పుల సమ్మయ్య దగ్గర రెండు పెట్రోల్ క్యాన్లు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి బుధవారం సాయంత్రం మంచిర్యాల పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్న శాంతయ్యకు ఏడేళ్ల క్రితం పరిచయమైన పద్మతో స్నేహం కాస్త హద్దులు దాటి సహజీవనం వరకు వెళ్లింది. భార్య మరో యువకుడికి దగ్గరైంది. ఈ డబుల్ యాంగిల్ వివాహేతర సంబంధాల్లో ఆస్తుల గొడవలు, భూముల లావాదేవీలు వచ్చి‌చేరాయి. ఈ క్రమంలో భర్త ఆస్తి తనకు దక్కదని భావించిన భార్య.. ఆ ఇద్దరిని మట్టుపెడితే ఆస్తి అంతా తనకే దక్కుతుందని ప్లాన్ వేసిందిసృజన. ఇందుకు కుమారులిద్దరు సపోర్ట్ ఇచ్చారు. సృజనకు శారీరకంగా దగ్గరైన లక్షేట్టిపేట యువకుడు.. శాంతయ్యపై పలుమార్లు హత్యయత్నానికి ప్రయత్నించాడు. 3 నెలల క్రితం శాంతయ్య కిడ్నాప్‌ చేసే ప్రయత్నాలు కూడా చేశాడు.

ఆ సమయంలో పోలీసులు కిడ్నాప్ కేసును లైట్ తీసుకుని భార్య, భర్తలిద్దరిని కలిపేందుకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అది కాస్తా బెడిసికొట్టి ఇలా సజీవదహనం వరకు వెళ్లిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సజీవదహనం చేసేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న సృజన.. ఘటన జరిగిన ఇంటి దగ్గర మూడు రోజులు నలుగురు వ్యక్తులతో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది‌. భర్త శాంతయ్యతో కలిసి ఉంటున్న ప్రియురాలు మాస పద్మ.. పద్మ భర్త శివయ్యను హత్య చేయాలని డిసైడ్ అయిన సృజన… ప్రియుడి స్నేహితులకు 15 లక్షల సుపారీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆ డబ్బులను భూమి రూపంలో ఇస్తానని మాటిచ్చిన సృజన.. అందుకు తగ్గట్టుగానే ల్యాండ్ పేపర్లను సైతం ప్రియుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 16 టీంలతో లోతుగా దర్యాప్తు ‌చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..