Allu Arjun: పోలీసుల ముందుకు అల్లు అర్జున్.. విచారణకు హాజరైన ఐకాన్ స్టార్

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ కు ఒక్కరోజు ముందు ప్రీమియర్స్ వేశారు. ఈ క్రమంలో సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అలాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ అభిమానులను తోసెయ్యడంతో తొక్కిసలాట జరిగింది.

Allu Arjun: పోలీసుల ముందుకు అల్లు అర్జున్.. విచారణకు హాజరైన ఐకాన్ స్టార్
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2024 | 11:15 AM

అల్లు అర్జున్ పోలీసులు ముందు హాజరయ్యారు. నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు పోలీసులు. సంద్యథియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసిన చేశారు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ సందడి చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు. దాంతో అల్లు అర్జున్ బౌన్సర్లు జనాలను వెనక్కి నెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను ఏ 11గా చేర్చారు.

డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా మరోసారి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసుకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ  విచారణలు పోలీసులు సంధ్య థియేటర్ లో జరిగిన సంఘటన గురించి అల్లు అర్జున్ ను ప్రశ్నించనున్నారు. అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు