Tamannaah Bhatia: ప్రియుడితో ఫోటోను షేర్ చేసిన తమన్నా.. నెటిజన్స్ ఏమంటున్నారంటే

తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో స్పీడ్ తగ్గించింది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో నటించింది. ఎక్కువగా హిందీ సినిమాల పై ఫోకస్ చేసింది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు కూడా చేసింది. అలాగే ఈ చిన్నది బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను పెళ్లాడనుందని తెలుస్తుంది.

Tamannaah Bhatia: ప్రియుడితో ఫోటోను షేర్ చేసిన తమన్నా.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
Tamannaah Bhatia
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 24, 2024 | 9:59 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : మెంటల్ మాస్ మావ.! ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

తమన్నా ప్రస్తుతం గోవాలో ఉంది. ఈ అందాల భామ గోవాలో తన హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడ నుంచి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ చిన్నది. అందులో ఆమె స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది , అలాగే తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వీడియో గేమ్‌లు ఆడుతున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఇది కూడా చదవండి :17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం

చిత్రాలను పంచుకుంటూ, “గోవా గేట్‌వే” అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో తమన్నా చాలా అందంగా మెరిసింది. లస్ట్ స్టోరీస్ 2′ వెబ్ సిరీస్ లో తమన్నా, విజయ్ కలిసి నటించారు. ఈ సిరీస్ షూటింగ్ నుంచే  డేటింగ్ చేయడం ప్రారంభించామని విజయ్ వర్మ  గతంలో తెలిపాడు. 35 ఏళ్ల తమన్నా భాటియా 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది తెలుగు సినిమాల్లోకి కూడా అడుగుపెట్టింది. హ్యాపీడేస్ సినిమా నుంచి ఈ చిన్నదాని క్రేజ్ పెరిగిపోయింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ గా మారింది. ప్రస్తుతం హిందీ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇది కూడా చదవండి :పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ భామ.. విడాకులు తీసుకున్న వ్యక్తితో వివాహం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..