థియేటర్లలో పుష్పరాజ్ జోరు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కమర్షియల్ సినిమాను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లిన ఈ మాస్ మూవీ అప్ కమింగ్ సినిమాలకు కొత్త టార్గెట్స్ సెట్ చేసింది.
సినిమా మేకింగ్‌లోనే కాదు ప్రమోషన్, రిలీజ్, ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లింది పుష్ప 2 యూనిట్.
అందుకే రిజల్ట్ ఈ రేంజ్లో కనిపిస్తోంది. చాలా ఎర్లీగా సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన పుష్ప 2 టీమ్, సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను చుట్టేసింది.
దేశవ్యాప్తంగా ప్రతీ చోట తమ సినిమాతో ఆడియన్స్‌కు దగ్గరయ్యేందుకు బన్నీ చేసిన ప్రయత్నం బాగా వర్కవుట్ అయ్యింది.
ఆఫ్టర్ రిలీజ్ వసూళ్ల విషయంలో అది పర్ఫెక్ట్‌గా కనిపించింది. ఇటీవల ఢిల్లీలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది మూవీ టీం.
తొలిరోజు 294 కోట్ల వసూళ్లతో ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ రూల్ మొదలుపెట్టింది పుష్ప 2.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకుపైగా వసూళ్లు సంధించి టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా.
ఈ సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్ 1000 కోట్ల క్లబ్లో చేరారు. వసూళ్ళలో ఇండియా వైడ్ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.