పుష్ప రూట్ లోనే గేమ్ చెంజర్.. హిట్ కోసం పక్క ప్లాన్..
24 December
2024
Battula Prudvi
పుష్ప 2 టీం పక్క ప్లాన్‌తో సినిమా ప్రమోషన్స్ చేసి సక్సస్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు గేమ్ ఛేంజర్ మేకర్స్.
అమెరికా నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి, తెలుగు రాష్ట్రాల్లో వరుస ఈవెంట్స్‌కు రెడీ అవుతున్నారు గేమ్ చేంజర్ టీం.
ఈ నెల 21న అమెరికాలో మెగా ఈవెంట్ చేసింది చరణ్ టీమ్, ఆ ఈవెంట్ తరువాత ఇండియాలోనూ వరుస ఈవెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా నార్త్ స్టేట్స్ మీద స్పెషల్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తూ ప్రమోషన్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
రిలీజ్ విషయంలోనూ బిగ్ నెంబర్స్‌ను టార్గెట్ చేస్తోంది గేమ్ చేంజర్ టీమ్. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 12500 స్క్రీన్స్‌లో రిలీజ్ అయ్యింది.
దీంతో ఓపెనింగ్ డే ఆల్ టైమ్ రికార్డ్ సాధ్యమైంది. అందుకే గేమ్ చేంజర్‌ను కూడా అదే రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.
మరి సంక్రాతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న గేమ్ చేంజర్ విషయంలో ఈ ప్లానింగ్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై చరణ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
చీరలో జబ్బిలికి సొంత సోదరిలా మెరిసిపోతున్న ఐశ్వర్య..
అందానికి ఈ ముద్దుగుమ్మ ప్రియా సఖి.. స్టన్నింగ్ జాన్వీ..
నింగి నుంచి జాలువారిన తారలు ఈమెలా మారాయి.. డేజ్లింగ్ మిర్న..