Ashwin: “నేను ఆ పని చేయనంటే చేయను”! అశ్విన్ ప్రవర్తనపై సంచలన నిజాలు బయటపెట్టిన భారత మాజీ బ్యాటర్
రవిచంద్రన్ అశ్విన్ తన గేమ్ అవగాహన, ప్రణాళికా చతురతతో ప్రత్యేకంగా నిలిచాడు. స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయకూడదనే నిర్ణయం అతని వ్యూహాత్మక ఆలోచనకు ఉదాహరణ. రిటైర్మెంట్ తర్వాత కూడా, IPLలో తన ప్రావీణ్యాన్ని కొనసాగిస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడుఅశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, IPLలో అతను తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేయడం అతని క్రికెట్ శక్తిని చాటిచెప్పే మరో ఉదాహరణ.
రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌లో తన సత్తా చాటుకున్న అద్భుత ఆటగాడు. 765 వికెట్లు, 6 టెస్ట్ సెంచరీలతో తాను క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. అశ్విన్ బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత విలేకరుల సమావేశంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించడంతో అభిమానులు, క్రికెట్ సోదరులు అతని గొప్ప కెరీర్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇదే సమయంలో, భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ అశ్విన్ గేమ్‌పై చూపించిన చతురత గురించి ఆసక్తికర సంఘటనను బయటపెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ సెషన్‌లో స్టీవ్ స్మిత్‌కి బౌలింగ్ చేయడానికి అశ్విన్ నిరాకరించిన సందర్భాన్ని కైఫ్ గుర్తుచేసుకున్నాడు. స్మిత్ తన హెల్మెట్‌పై కెమెరా ధరించి ఉండటం గమనించిన అశ్విన్, తన బౌలింగ్‌ను విశ్లేషించవద్దనే ఆలోచనతో బౌలింగ్ చేయడానికి నిరాకరించాడని కైఫ్ తెలిపారు. ఆ టోర్నమెంట్ తరువాత అదే సవత్సరంలో టీ20 ప్రపంచ కప్ ఉన్నందున, ఆస్ట్రేలియన్ విశ్లేకులకు తన బౌలింగ్ తీరు తెలిసిపోతుందని అశ్విన్ అన్నాడు అని కైఫ్ పేర్కొన్నాడు. ఇది అశ్విన్ గేమ్‌కు ఎంత అవగాహన కలిగిఉందో చూపిస్తుంది అంటూ కైఫ్ అభిప్రాయపడ్డారు.
సునీల్ గవాస్కర్ తన వ్యాఖ్యానంలో అశ్విన్‌ను అత్యంత తెలివైన క్రికెటర్‌గా అభివర్ణించారు. “అతను తన ప్రణాళికలు, ఆలోచనలతో ఎప్పుడూ ముందుండే వ్యక్తి. అతని మనోబలమే అతని విజయాలకు ప్రధాన కారణం,” అని గవాస్కర్ అన్నారు.
అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, IPLలో అతను తన ప్రతిభను కొనసాగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ అశ్విన్‌ను రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేయడం అతని క్రికెట్ శక్తిని చాటిచెప్పే మరో ఉదాహరణ.
What happened between Rishabh Pant and Ashwin at Delhi Capitals?
More unheard stories about R Ashwin from his time with the Delhi Capitals and more.#CricketWithKaif11 pic.twitter.com/egtQwQxWpG
— Mohammad Kaif (@MohammadKaif) December 21, 2024