AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్ పై వెంబడించి.. తుపాకీతో కాల్పులు జరిపి.. రీల్ సీన్ కాదు రియల్ సీనే

సిద్దిపేట(Siddipeta) జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన వంశీకృష్ణ.. ఓ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ విషయంలో ఒగ్గు తిరుపతి అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో...

బైక్ పై వెంబడించి.. తుపాకీతో కాల్పులు జరిపి.. రీల్ సీన్ కాదు రియల్ సీనే
Gun
Ganesh Mudavath
|

Updated on: Mar 10, 2022 | 10:33 AM

Share

సిద్దిపేట(Siddipeta) జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని చెల్లాపూర్‌కు చెందిన వంశీకృష్ణ.. ఓ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఈ విషయంలో ఒగ్గు తిరుపతి అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో భూమిని ఎక్కువ ధరకు కొనేలా చేశాడనే ఆరోపణలతో వంశీకృష్ణ 2020 జూన్‌లో తిరుపతిపై కత్తితో చంపేదుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. కాగా.. ఈ కేసు విషయం దుబ్బాక(Dubbaka) కోర్టులో విచారణ కొనసాగుతోంది. తనపై ఉన్న హత్యాయత్నం కేసులో వంశీకృష్ణ తల్లితో కలిసి బుధవారం దుబ్బాక కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వచ్చాడు. తిరిగి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి వద్ద తిరుపతి, మరో వ్యక్తితో కలిసి వెనక నుంచి కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో ఒకటి వాహనానికి, మరోటి నేలకు తాకింది. అప్రమత్తమైన వంశీకృష్ణ దారి మళ్లించి తప్పించుకున్నాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న వంశీకృష్ణ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వంశీకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరోవైపు కాల్పులకు పాల్పడిన తిరుపతి, మరో వ్యక్తి పోలీసులకు లోంగిపోయినట్లు తెలుస్తోంది. కాల్పుల వెనక ఎవరెవరున్నారు? వీరికి తుపాకి ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read

UP Election Results 2022: యూపీలో మరోసారి యోగి సర్కార్! ట్రెండ్స్‌లో మేజిక్ ఫిగర్ దాటేసిన BJP

Varsha Bollamma: పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..! కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తున్న ‘వర్ష’ క్యూట్ ఫొటోస్..

Assembly Election Results 2022: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత