CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. స్వామివారి కల్యాణ మహోత్సవానికి హాజరు

యాదాద్రి(Yadadri) లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు సమయం సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రేపు క్షేత్ర పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా...

CM KCR: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. స్వామివారి కల్యాణ మహోత్సవానికి హాజరు
Yadadri Temple Gopuram
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 10, 2022 | 11:18 AM

యాదాద్రి(Yadadri) లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు సమయం సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రేపు క్షేత్ర పర్యటనకు రానున్నారని తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. బుధవారం రోజు(నిన్న) ప్రగతిభవన్‌లో యాడా, ఆలయ నిర్వాహకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, పునఃప్రారంభ ఏర్పాట్లు, ఆలయ ఉద్ఘాటన పర్వంలో చేపట్టనున్న పంచకుండాత్మక హోమం, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలపై చర్చించారు.యాదాద్రిలో మార్చి 21 నుంచి మహాసుదర్శన యాగం నిర్వహించనుండగా.. 75 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి.

Also Read

Donald Trump: ​ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పించుకున్న మాజీ అధ్యక్షుడు..

Maruti Holi Offers 2022: కారు కొనుగోలుదార్లకు బంపరాఫర్‌! మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటన..

Kiran Abbavaram : కుర్ర హీరోతో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ.. కిరణ్ అబ్బవరం దశ తిరిగినట్టే..