AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Manifesto: తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. పొందుపరిచిన అంశాలు ఇవే..

తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు.

Congress Manifesto: తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్.. పొందుపరిచిన అంశాలు ఇవే..
Mallikarjun Kharge Releases Congress Party Manifesto For Telangana Election 2023 At Gandhi Bhavan, Hyderabad (2)
Srikar T
| Edited By: |

Updated on: Nov 17, 2023 | 2:59 PM

Share

తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో జోరు పెంచడంతో పాటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విడుదల చేశారు. సుమారు 42పేజీలతో, 62 అంశాలను ప్రస్తావించారు. గతంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అనుబంధంగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారు. అభయ హస్తం పేరుతో మ్యానిఫెస్టోను రూపకల్పన చేశారు. తెలంగాణకు అవసరమైనన్ని అంశాలు ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు వేణుగోపాల్‌తో పాటూ రేవంత్ రెడ్డి తదితర తెలంగాణ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సునామీ సృష్టించబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా ఉంటుందన్నారు.

మ్యానిఫెస్లోలోని ముఖ్యాంశాలు..

  • మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్‌ను పొందుపరిచారు.
  • దళిత, గిరిజనులకు మేలు చేకూర్చేలా మ్యానిఫెస్టో ఉందన్నారు.
  • మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేసేలా చర్యలు చేపడతాం.
  • రైతులకు 24గంటలు ఫ్రీ కరెంట్.
  • కాళేశ్వరం ముంపు బాధితులకు సాయం.
  • ముంపు నివారనకు కరకట్టల నిర్మాణం.
  • ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 వరకూ గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్.
  • ప్రతి రోజూ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ ఏర్పాటు చేస్తాం.
  • 2లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం అందిస్తాం.
  • రాష్ట్రంలో కొత్తగా ట్రిపుల్ ఐటీలు నిర్మిస్తాం.
  • విత్తనాలు, ట్రాక్టర్లు, ఎరువులు కొనుగోలుపై సబ్సీడీ అందిస్తాం.
  • 18ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ.
  • నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10లక్షల వడ్డీ లేని రుణం.
  • జూన్2న నోటిఫికేషన్.. సెప్టెంబరు 17 లోపూ ఉద్యోగాల భర్తీ.
  • నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి
  • రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేలు ఆర్థిక సాయం.
  • రైతు కూలీలకు రూ. 12వేలు ఆర్థిక సాయం.
  • అన్ని పంటలకు మద్దతు ధర
  • చక్కెర కర్మాగారాలు తెరవడం, పసుపు బోర్డు ఏర్పాటు.
  • భూమి లేని రైతులకు సైతం రైతు భీమా.
  • ధరణి పోర్టల్ రద్దు.
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు రూ.25వేలు గౌరవ వేతనం
  • అమరవీరుల కుటుంబంలో ఒకరికి సర్కార్ కొలువు.
  • విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం.
  • ఆరోగ్య శ్రీ పథకం రూ. 10లక్షలకు పెంపు
  • ప్రతి విద్యార్థికి రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు.
  • మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10వేలకు పెంపు.

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఖర్గే ధీమా

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. కేసీఆర్ పదవీ విరమణకు సమయం ఆసన్నమైందన్నారు. టాటా బాయ్ బాయ్ చెప్పి కేసీఆర్‌ను ఇంటికి సాగనంపుతామన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని.. అలాగే తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే..

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే..ప్రసంగం వీడియో

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..