AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎవర్రా మీరంతా.. అర్థరాత్రి ఆటోలో వస్తున్న ఐదుగురు వ్యక్తులు.. కట్ చేస్తే, పోలీసులను చూసి..

మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా పశువుల దొంగతనాలకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి నెట్టారు.. రాత్రివేళ పశువుల లోడుతో వస్తూ పోలీసులను చూసి పారిపోవాలనుకున్న ఐదుగురు వ్యక్తులను ఎట్టకేలకు పట్టుకున్నారు.

ఎవర్రా మీరంతా.. అర్థరాత్రి ఆటోలో వస్తున్న ఐదుగురు వ్యక్తులు.. కట్ చేస్తే, పోలీసులను చూసి..
Crime News
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Nov 06, 2024 | 6:29 PM

Share

గత కొంతకాలంగా రైతులు వ్యవసాయ పొలాలలో, ఇంటిదగ్గర కట్టేసిన పశువులను దొంగతనం చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు గ్రామాల్లో రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే పోలీసులు ఓ పక్క, ఊర్లలో రైతులు మరోపక్క.. ఈ దొంగల కోసం అర్దరాత్రుల్లు వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో పశువుల దొంగతనం చేసి పారిపోతుండగా ఎట్టకేలకు దేవరకద్ర ఖాకీల చేతికి చిక్కారు దుండగులు.. దేవరకద్ర ఎస్ఐ నాగన్న తన సిబ్బందితో కలిసి అమ్మపూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు ఎద్దులను తీసుకొని రాయచూర్ వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనంపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో సదరు వాహనాన్ని నిలిపి వివరాలు అడిగారు. దీంతో పోలీసులను చూసి కంగుతిన్న ఐదుగురు నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. నేరస్తులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు అసలు విషయం బయటపెట్టారు. తాము పలు ప్రాంతాలలో పశువులను దొంగతనం చేసి రాయచూర్ లో అమ్ముతున్నామని వెల్లడించారు. నిందితుల నుంచి రెండు బర్రెలు, రెండు దూడలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దొంగల ముఠా లింగాల, నందికొట్కూర్, కోరుకొండ, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దేవరకద్ర, తాండూర్, తిమ్మాజీపేట, జడ్చర్ల, కల్వకుర్తి, భూత్పూర్ ప్రాంతాలలో పశువులను దొంగతనాలు చేసేవారని వెల్లడించారు. ఈ నేరస్తులు ఒక ప్రాంతం నుంచి పశువులు దొంగతనం చేసి మరో ప్రాంతంలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 26 సార్లు దొంగతనం చేయగా మొదటిసారి పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న పశువులను బాధితుడు దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రైతుకు అప్పగించారు. పట్టుబడిన పశువుల విలువ రూ.2,80,000 ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలో దొంగిలించిన పశువులను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

వీడియో చూడండి..

రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పశువుల దొంగల ముఠాను పట్టుకున్న ఎస్ఐ నాగన్న, కానిస్టేబుళ్ళు వెంకటేష్, నాను నాయక్ ను డిఎస్పి వెంకటేశ్వర్లు అభినందించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us