Telangana: అమ్మాయిలు పుట్టడమే అదృష్టంగా భావిస్తున్న గ్రామం.. రాష్ట్రానికి ఆదర్శం.. ఎందుకో తెలుసా..?
కొండయ్యపల్లి లాగా అన్ని గ్రామాలు అదర్శంగా తీసుకోవాలి. గ్రామంలోని అడబిడ్డలకు అండగా నిలిస్తే, ఆడపిల్లల భ్రూణహత్యలు తగ్గడమే కాకుండా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావిస్తున్నారు.
అది ఒక కుగ్రామం అది.. ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకుని జీవించేవారే..! ఎటు చూసిన పంటపొలాలు, పచ్చదనం కనబడుతుంది. వీరి మట్టి మనస్సులు కూడా అంతే స్వచ్చంగా ఉంటాయి. ఇక్కడ ఆడ పిల్ల జన్మిస్తే పండుగా వాతావరణంలా ఉంటుంది. ఆడపిల్లలకు తలో చేయి వేసి భరోసా కల్పిస్తున్నారు ఆ పల్లెవాసులు. ఒక్కసారి ఆ ఆదర్శ గ్రామం గురించి తెలుసుకుందాం..!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయి పల్లి. ఇది పచ్చని పొలాలతో నిండి ఉంటుంది. చుట్టూ కొండలు ఉంటాయి. గతంలో ఈ .గ్రామంలో పెంటయ్య దంపతులకు ఇద్దరూ అడబిడ్డలు.. చేనేత పని చేస్తూ బతికే పెంటయ్య బతుకుదెరువు కోసం మహారాష్ట్రలోని భివాండికి వెళ్లాడు. ఎనిమిది ఎళ్ళలో భార్యా పిల్లల బాగోగులు పట్టించుకోలేదు. ఏనాడు ఒక్క రూపాయి ఇంటికి పంపలేదు. పెద్ద బిడ్డ పెళ్ళీఈడుకు వచ్చినా ఆ బిడ్డకి పెండ్లి చేయాలని కబురు పంపినా.., పోన్ చేసినా స్పందించింది.
అప్పుడే కొండయ్యపల్లి గ్రామమంతా ఒక్కటైయ్యింది. ఊరి వారంతా.. తలా కొంత వేసి కొంత డబ్బును జమచేసి పెండ్లి చేసి సాగనంపారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో చైతన్యవంతం వచ్చింది. గ్రామంలోని ఎన్నారై రేండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువకులంతా తమ ఊరులోని ఏ ఆడబిడ్డకి ఇలాంటి కష్టం రావద్దని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని ఆడబిడ్డలని ఏ ఒక్క తల్లిదండ్రులకు భారంగా భావించవద్దని నిర్ణయం తీసుకున్నారు. ఆడబిడ్డ పెండ్లీడు వచ్చేసరికి గ్రామం ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నారు.
2018 లో శ్రీరామనవమి పండుగ రోజున ఎన్నారై రేండ్ల శ్రీనివాస్ గ్రామస్థులు అంతా కలిపి ఈ సంస్థ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా “మా ఊరు మహాలక్ష్మి” పౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ పౌండేషన్ ఇప్పటి వరకు పుట్టిన 60 మంది ఆడబిడ్డలకు రూ.5,000 చొప్పున డిపాజిట్ చేశారు. మరో 15 మందికి మొత్తం 75 మంది అడబిడ్డలకి అండగా నిలిచారు. వారి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. కొంత మంది తల్లిదండ్రులు సైతం డిపాజిట్ చేశారు.
మా ఊరు మహాలక్ష్మి పౌండేషన్ ఏర్పాటు పల్లెవాసుల్లో ఆర్థిక ప్రోత్సాహం పెరిగింది. అయితే, గ్రామస్థులకు మొదట నిధులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో 2017లో గ్రామంలో 10 మంది అడబిడ్డలు పుట్టడంతో గ్రామస్థులు, ఎన్నారై ల సహకారంతో గ్రామం తరుపున ఐదువేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ప్రతిసంవత్సరం ఆడబిడ్డలకు మా ఊరు మాహలక్ష్మీ పౌండేషన్ గ్రామంలో అందరి సమక్షంలో పండుగ వాతావరణంలో పోస్టాఫీసులో జమచేసిన ఫిక్స్‌డ్ బాండులు ప్రజాప్రతినిధులని పిలిచి తల్లిదండ్రులకి ఇస్తున్నారు.
ఇప్పటికీ ఏడు సంవత్సరాలలో గ్రామంలో పుట్టిన అడబిడ్డలు అందరికి దాదాపుగా 60 మంది కి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడమే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునేలా దగ్గర ఉండి చూపిస్తున్నారు. గ్రామస్థులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే రూ.5,000 తోపాటుగా తల్లిదండ్రులు మరో రూ. 5,000 కలిపి జమ చేస్తున్నారు. అడబిడ్డ పెండ్లీడు వచ్చే సమయానికి దాదాపుగా ఒక లక్ష ముప్పై వేల వరకు జమ అవుతాయి. గ్రామంలో పుట్టిన ఆడబిడ్డకి కన్న ఊరే, ఒక మేనమామలాగా అర్థిక సహాయం అందిస్తుందని, దీంతో పెళ్లి చేసే కుటుంబానికి భారం తగ్గుతుంది.
తమ గ్రామంలో పుట్టిన అడబిడ్డలకు అండగా నిలవడమే కాకుండా తమ గ్రామంలో ఏదైనా ఏదైనా కుటుంబ పెద్ద గల్ఫ్ లో మరణిస్తే, కుటుంబ పెద్దలాగా గ్రామ అండగా నిలుస్తోంది. మా ఊరు మాహాలక్ష్మీ పౌండేషన్ ద్వారా ఆడబిడ్డల పేరు మీద పదివేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15 మందికి బాసటగా నిలిచారు. సొంత కుటుంబ సభ్యులే ఆదుకోని ఈ రోజులలో కొండయ్యపల్లి గ్రామం అడబిడ్డలకు అండగా నిలుస్తూ రాష్ట్రంలోనే అదర్శంగా నిలుస్తుంది.
కొండయ్యపల్లి లాగా అన్ని గ్రామాలు అదర్శంగా తీసుకోవాలి. గ్రామంలోని అడబిడ్డలకు అండగా నిలిస్తే, ఆడపిల్లల భ్రూణహత్యలు తగ్గడమే కాకుండా ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పుట్టిందని భావిస్తున్నారు. ఆ గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలకు ఊరంతా ఒకటై పెళ్ళికి బాసటగా నిలుస్తున్నారు. ఆ గ్రామంలో పుట్టిన ఆడబిడ్డలని రక్షించుకునేందుకు ఒక పౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామం తరుపున ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..