Lover Protest: ఓ యువతితో ప్రేమ.. మరో యువతితో నిశితార్థం.. మోసం చేశాడంటూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా
ప్రేమించి పెళ్లి అంటే ముఖం చాటేయ్యడమే కాదు.. మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయ్యాదంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా మొదలు పెట్టింది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమాయణం సాగించాడు. అయితే రెండు రోజుల క్రితం మరో యువతీతో ప్రశాంత్ కు నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రియుడు ప్రసాద్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

ప్రేమించిన ప్రియుడు మోసం చేయడంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం ప్రియుడు ప్రశాంత్ కు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం ప్రియురాలుకు తెలియడంతో ప్రియుని ఇంటి ముందు ధర్నాకు దిగింది.
తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని తనకు న్యాయం జరగాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నా కొనసాగిస్తుంది. తనకు పోలీసులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ధర్నా చేస్తున్న ప్రియుడి ఇంటి వద్దకు స్థానిక బీబీపేట పోలీసులు చేరుకొని ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




